Redmi Buds 5 First Sale : భారత్‌లో రెడ్‌మి బడ్స్ 5 సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

Redmi Buds 5 First Sale : భారత్‌లో రెడ్‌మి బడ్స్ 5 ఫస్ట్ సేల్ మొదలైంది. రెడ్‌మి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో తక్కువ ధరకు ఈ కొత్త బడ్స్ 5 మోడల్ కొనుగోలు చేయొచ్చు. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Redmi Buds 5 First Sale : భారత్‌లో రెడ్‌మి బడ్స్ 5 సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

Redmi Buds 5 goes on first sale in India today

Redmi Buds 5 First Sale : కొత్త ఇయర్ బడ్స్ కొంటున్నారా? భారత మార్కెట్లో రెడ్‌మి బడ్స్ 5 సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మి బడ్స్ 5 సిరీస్ తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రారంభ కొనుగోలుదారులు ఈ ప్రొడక్టుపై ఆకర్షణీయమైన తగ్గింపును కూడా పొందవచ్చు.

Read Also : OnePlus Nord CE 3 Lite 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?

ఈ డివైజ్‌లో సౌండ్ క్వాలిటీ కోసం 46డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కలిగి ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ డిటెక్ట్ చేసేలా మూడు విభిన్న ట్రాన్స్‌పరంట్ మోడ్‌లు, ఫాస్ట్ ఛార్జింగ్‌తో 38 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 5 నిమిషాల ఛార్జింగ్‌తో కేవలం 2 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందించడం వంటి అనేక ఆసక్తికరమైన ఫీచర్‌లను కలిగి ఉంది. అంతేకాదు, ఈ బడ్స్ డివైజ్ పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

రెడ్‌మి బడ్స్ 5 ధర ఎంతంటే? :
రెడ్‌మి బడ్స్ 5 సిరీస్ రూ. 2999 వద్ద అందుబాటులో ఉంది. అయితే, అమెజాన్‌లో ఈ డివైజ్‌ను రూ. 2899కి పొందవచ్చు. ఫ్యూజన్ పర్పల్, ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ వైట్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వినియోగదారులు రెడ్‌మి నోట్ 13 స్మార్ట్‌ఫోన్ సిరీస్ లేదా షావోమీ, రెడ్‌మి ప్యాడ్‌తో కొనుగోలు చేసినట్లయితే.. షావోమీ రెడ్‌మి బడ్స్ 5ని రూ. 2,499కే సొంతం చేసుకోవచ్చు.

రెడ్‌మి బడ్స్ 5 స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి బడ్స్ 5 అనేది ప్రీమియం సౌండ్ క్వాలిటీ, ఎఫెక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తుంది. ఈ లేటెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ 46(dB) హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటాయి. దాదాపు అన్ని బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను బ్లాక్ చేయగలవు. అలాగే క్లియర్ కాల్స్, వాయిస్ కమాండ్‌ల కోసం డ్యూయల్-మైక్ ఏఐ వాయిస్ అప్‌గ్రేడ్ ఆప్షన్ కలిగి ఉన్నాయి. 12.4ఎమ్ఎమ్ డైనమిక్ టైటానియం డ్రైవర్‌లు కూడా ఉన్నాయి. హై క్వాలిటీ సౌండ్ అందిస్తాయి. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో గూగుల్ ఫాస్ట్ పెయిర్ కంప్యాటబిలిటీ డివైజ్‌లతో సులభంగా పెయిరింగ్ చేసుకోవచ్చు.

షావోమీ ఇయర్‌బడ్స్ యాప్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్‌లు, టచ్ కంట్రోల్‌లు, ఆడియో ఎఫెక్ట్‌ల వంటి వివిధ సెట్టింగ్‌లను కస్టమైజ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. నాయిస్ వంటి పరిస్థితుల్లో కూడా సరైన కాల్ క్వాలిటీని అందిస్తుంది. దీనికి డ్యూయల్-ఛానల్ ఏఐ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. అడ్జెస్ట్ చేయగల నాయిస్ క్యాన్సిలేషన్ లెవల్స్ కోసం మూడు ట్రాన్స్‌పరంట్ మోడ్‌లను కూడా అందిస్తుంది.

రెడ్‌మి బడ్స్ 5 ఫాస్ట్ ఛార్జింగ్‌ని అందిస్తోంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల ప్లేటైమ్, కేస్‌తో మొత్తం 38 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఆటోమేటిక్ పాజ్ కోసం ఇన్-ఇయర్ డిటెక్షన్ ఫంక్షన్‌ను కలిగి ఉంది. ఇయర్‌బడ్‌లను తొలగించడం లేదా మళ్లీ ఇన్సర్ట్ చేసినప్పుడు, ప్లే, పాజ్, స్కిప్పింగ్ ట్రాక్‌లు వంటి వివిధ ఫంక్షన్‌ల కోసం ఎనిమిది కస్టమైజడ్ గెచర్స్ సపోర్టు అందిస్తుంది.

Read Also : Xiaomi 14 Series Launch : మార్చి 7న షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. మొత్తం 3 మోడళ్లలో లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలివే..!