TSRTC: జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సత్తా

2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు.

TSRTC: జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సత్తా

TSRTC: గుజరాత్ లోని బరోడాలో ఇటీవల జరిగిన 2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఉద్యోగులు రెండు పతకాలను సాధించారు. బాడ్మింటన్ విమెన్స్ డబుల్ కేటగిరిలో రన్నర్ అప్స్ గా టీఎస్ఆర్టీసీకి చెందిన ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి నిలిచారు. వారు సిల్వర్ మెడల్ సాధించారు. బాడ్మింటన్ విమెన్స్ టీం చాంపియన్ కేటగిరిలో టీఎస్ఆర్టీసీ రన్నర్ ఆప్స్ గా నిలిచింది. ఈ కేటగిరిలో ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవితలు సిల్వర్ మెడల్ గెలుపొందారు.

Zealandia: 8వ ఖండాన్ని కనుక్కొన్న శాస్త్రవేత్తలు.. కళ్ల ముందే ఉన్నా 375 ఏళ్లకు కానీ గుర్తించలేకపోయాం

2వ ఇంటర్ స్టేట్ పబ్లిక్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఎస్టీయూ) స్పోర్ట్స్ మీట్ లో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటి పతకాలు సాధించడంపై సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన ట్రూడి మెక్ డొనాల్డ్, ఛాయదేవి, కవితలను బస్ భవన్లోని తన ఛాంబర్లో శ‌నివారం ఆయన అభినందించారు. నిరంతర కృషి, ప్రాక్టిస్తోనే క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. క్రీడల్లో ఆసక్తిగా ఉన్న ఉద్యోగులను సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందని సజ్జనర్ చెప్పారు.