Goa beach : గోవా బీచ్‌లో ఫిష్ కర్రీ, రైస్ విక్రయాలు తప్పనిసరి…ప్రభుత్వ ఉత్తర్వులు

గోవా బీచ్‌ ఇసుక తిన్నెల్లో సేద తీరుతూ చేపలకూరతో అన్నం తింటుంటే ఆ రుచి మర్చిపోలేనిది అంటారు పర్యాటకులు. పర్యాటకుల ఆసక్తిని గమనించిన గోవా సర్కారు గోవా బీచ్‌లలోని హోటళ్లలో ఫిష్ కర్రీ, రైస్ విక్రయాలు తప్పనిసరి చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది....

Goa beach : గోవా బీచ్‌లో ఫిష్ కర్రీ, రైస్ విక్రయాలు తప్పనిసరి…ప్రభుత్వ ఉత్తర్వులు

fish curry-rice

Goa beach : గోవా బీచ్‌ ఇసుక తిన్నెల్లో సేద తీరుతూ చేపలకూరతో అన్నం తింటుంటే ఆ రుచి మర్చిపోలేనిది అంటారు పర్యాటకులు. పర్యాటకుల ఆసక్తిని గమనించిన గోవా సర్కారు గోవా బీచ్‌లలోని హోటళ్లలో ఫిష్ కర్రీ, రైస్ విక్రయాలు తప్పనిసరి చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బీచ్ హోటళ్లలో భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో పాటు తీరప్రాంత గోవా రాష్ట్రంలోని ప్రధానమైన ఫిష్ కర్రీ-రైస్ అందించాలని గోవా ఆదేశించినట్లు గోవా రాష్ట్ర పర్యాటక మంత్రి రోహన్ ఖౌంటే తెలిపారు. గోవా వంటకాలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన కొత్త పాలసీలో కొబ్బరి ఆధారిత వంటకాలను తప్పనిసరిగా చేర్చాలని నిర్ణయించామన్నారు.

Also Read : Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి, 260 మృతదేహాలు లభ్యం

బీచ్ హోటళ్లలో గతంలో గోవా వంటకాలు అందుబాటులో ఉండేవి కావు. బీచ్‌లలో అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. గోవాలోని హోటళ్లలో సగటున 80 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు మంత్రి తెలిపారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రం ముందడుగు వేయాలని, దీని కోసం పర్యాటక శాఖ, ఇతర భాగస్వాములు కలిసి పనిచేయాలని మంత్రి కోరారు.