ODI World Cup 2023: ఒక్క బాల్‌కు 13 పరుగులు సాధ్యమా? కివీస్ బ్యాటర్ ఎలా కొట్టాడో ఈ వీడియో చూడండి ..

ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు కేవలం 223 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.

ODI World Cup 2023: ఒక్క బాల్‌కు 13 పరుగులు సాధ్యమా? కివీస్ బ్యాటర్ ఎలా కొట్టాడో ఈ వీడియో చూడండి ..

Netherlands vs New Zealand Match

New Zealand vs Netherlands Match ODI World Cup 2023 : భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. పలు‌ మ్యాచ్‌లలో పరుగుల వరద పారుతుంది. సోమవారం ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు కేవలం 223 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో కివీస్ ప్లేయర్ ఒక్క బంతిలో 13 పరుగులు రాబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : ODI World Cup 2023: టీమిండియాకు బిగ్‌షాక్.. చెన్నై ఆస్పత్రిలో శుభ్‌మన్ గిల్.. పాక్‌తో మ్యాచ్‌కూ డౌటే

ఈ మ్యాచ్‌లో కివీస్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ 17 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆ రెండు సిక్సులుకూడా ఒకే బాల్‌కు కొట్టాడు. దీంతో ఒక్క బాల్‌కే 13 పరుగులు రాబట్టాడు. అలాఎలా సాధ్యమైందని మీకు డౌట్ రావొచ్చు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డిలీడే వేశాడు. ఇన్నింగ్స్ లో చివరి బంతిని శాంట్నర్ లాంగ్ ఆన్ పై సిక్స్ కొట్టాడు. అయితే, ఆ బాల్ ను అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఫ్రీ హిట్ వేయాల్సి వచ్చింది. మరోసారి బాస్ డిలీడే తక్కువ ఎత్తులో ఫుల్ టాస్ వేశాడు.. దానిని కూడా లాంగాన్ మీదుగా స్టాండ్స్ లోకి సిక్స్ కొట్టాడు. దీంతో ఒక్క బాల్ కే 13 పరుగులు వచ్చినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : World Cup 2023 ENG vs BAN ODI : ఇంగ్లండ్ తో తలపడుతున్న బంగ్లాదేశ్

ఈ మ్యాచ్ లో కివీస్ బ్యాటర్లు రాణించారు. విల్ యంగ్ (70), టామ్ లేథమ్ (53) పరుగులు చేయగా.. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర మరోసారి రాణించి 51 పరుగులు చేశాడు. చివరిలో డారిల్ మిచెల్, శాంట్నర్ రాణించడంతో కివీస్ భారీ స్కోర్ సాధించింది. వన్డే వరల్డ్ కప్ లో వరుసగా రెండు విజయాలతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లింది.