Lokesh : ఏపీ హైకోర్టులో లోకేష్ కు ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్ క్లోజ్ చేసిన ధర్మాసనం

లోకేష్ ను ముద్దాయిగా చూపనందున అయనను అరెస్టు చేయబోమంటూ సీఐడీ అధికారులు హైకోర్టుకు వివరించారు.

Lokesh : ఏపీ హైకోర్టులో లోకేష్ కు ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్ క్లోజ్ చేసిన ధర్మాసనం

High Court closed Lokesh anticipatory bail plea

High Court – Lokesh Anticipatory Bail : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు క్లోజ్ చేసింది. లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ కోర్టుకు తెలిపింది.

ఈ కేసులో లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. లోకేష్ ను ముద్దాయిగా చూపనందున అయనను అరెస్టు చేయబోమంటూ సీఐడీ అధికారులు హైకోర్టుకు వివరించారు. దీంతో ఈ కేస్ ను హైకోర్టు మూసివేసింది.

CM Jagan : పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు : సీఎం జగన్

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

అయితే ఈ కేసులో లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం క్లోజ్ చేసింది. దీంతో లోకేష్ కు భారీ ఊరట లభించింది.