Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ.. రాక్షసుడా? రాముడా?

రవితేజ కెరీర్ లో ఇది కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ లా నిలిచిపోతుంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో పర్ఫెక్ట్ గా జీవించేసాడనే చెప్పొచ్చు.

Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు మూవీ రివ్యూ.. రాక్షసుడా? రాముడా?

Raviteja Tiger Nageswara Rao Movie Review and Rating

Tiger Nageswara Rao Review : మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) తాజాగా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా నేడు అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజయింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించగా.. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, జిషుసేన్ గుప్తా ముఖ్య పాత్రలు పోషించారు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా దొరికిన కథలతో ఒక యాక్షన్ లవ్ కథని అల్లుకొని టైగర్ నాగేశ్వరరావు సినిమాని తెరకెక్కించారు.

కథ విషయానికి వస్తే.. దొంగతనాలు చేసుకుంటూ బతికే జనాలు ఉన్న స్టువర్టుపురంలో పుట్టిన నాగేశ్వరరావు(రవితేజ) చిన్నప్పటినుంచే దొంగతనాలు మొదలుపెడతాడు. పెద్దయ్యాక గజదొంగగా మారి ఏ ఏరియా అనేది కాకుండా అన్ని ఏరియాల్లోను దొంగతనాలు చేస్తుండటంతో మిగిలిన దొంగ ముఠాలు ఇతన్ని చంపేయాలని చూస్తూ ఉంటాయి. అదే సమయంలో ప్రేమలో పడటం, తన స్టువర్టుపురం పిల్లల కష్టాలు తెలుసుకోవడంతో, తన ఊరు బాగుపడటానికి ఒక పెద్ద దొంగతనం చేయాలని వెళ్తాడు. చేసి వచ్చాక ప్రేమించిన అమ్మాయితో లేచిపోదాం అనుకున్న సమయంలో పోలీసులకు చిక్కుతాడు. ఆ తర్వాత అతని ప్రేమ ఏమైంది? జైలు నుంచి బయటకి వచ్చాడా? మళ్ళీ దొంగతనాలు చేశాడా? తన స్టువర్టుపురం ఊరు బాగుపడిందా? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. సినిమా మూడు గంటల సేపు ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు డైరెక్టర్. మొదటి హాఫ్ లో నాగేశ్వరరావు దొంగతనాలు ఎలా చేశాడు అనే సీన్స్ చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాలు కూడా బాగా రాసుకున్నాడు. హీరోయిన్ తో ఉన్న ఎమోషనల్ సీన్స్ కూడా మెప్పించాయి. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అక్కడక్కడా ముందుకు వెనక్కి వెళ్తూ వస్తుండటంతో ప్రేక్షకులు కథనంలో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే టైగర్ నాగేశ్వరరావు కథ ఇదేనా కాదా అనేది తెలీదు కానీ కొన్ని కమర్షియల్ సినిమాల్లో లాగా మొదటి హాఫ్ హీరోని నెగిటివ్ గా చూపించి సెకండ్ హాఫ్ మంచిగా మారిపోయి తన వాళ్ళ కోసం ఏదో ఒక మంచి చేసే ఫార్ములానే ఈ సినిమాలో కూడా వాడారు.

ఆర్టిస్టుల విషయానికొస్తే.. రవితేజ కెరీర్ లో ఇది కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ లా నిలిచిపోతుంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో పర్ఫెక్ట్ గా జీవించేసాడనే చెప్పొచ్చు. హీరోయిన్ నుపుర్, గాయత్రీ భరద్వాజ్ తమ అందాలతో పాటు ఎమోషనల్ సీన్స్ లో మెప్పించారు. ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ లో అనుకీర్తి ఇంప్రెస్ చేస్తుంది. నెగిటివ్ పోలీసాఫీసర్ గా జిషు సేన్ గుప్తా అదరగొట్టాడు. అనుపమ్ ఖేర్, మురళి శర్మ, నాజర్ చిన్న పాత్రలైనా మెప్పించారు. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో రేణు దేశాయ్ ఎంట్రీ ఇచ్చి హేమలత లవణం పాత్రలో ప్రేక్షకులని మెప్పించింది. రవితేజ పక్కనే ఉండే క్యారెక్టర్స్ లో టెంపర్ వంశీ, కంచరపాలెం కిషోర్ అదరగొట్టారు. మొత్తంగా సినిమాలో ఆర్టిస్టులందరి దగ్గర్నుంచి డైరెక్టర్ తనకు కావాల్సింది రాబట్టుకున్నాడు.

Also Read :  రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఏంటి..?

టెక్నికల్ గా.. సినిమా కెమెరా విజువల్స్ ఆ కాలానికి తగ్గట్టు చక్కగా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ లు చాలానే ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా డిజన్ చేశారు. ముఖ్యంగా యాక్షన్, ఎలివేషన్ సీన్స్ లో BGM బాగా ఇచ్చారు. గ్రాఫిక్స్, సెట్స్ విషయంలో కూడా కూడా చాలా పక్కాగా జాగ్రత్తగా చూపించారు. డైరెక్టర్ వంశీ దర్శకుడిగా సక్సెస్ అయినట్టే.

మొత్తంగా గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథని రాక్షసుడు రాముడిగా ఎలా మారాడు అంటూ కమర్షియల్ పాయింట్ లో చూపించారు.