Russia Strikes Ukraine : ఉక్రెయిన్ పై రష్యా మరోసారి క్షిపణి దాడి.. పోస్టల్ డిపోపై దాడి ఘటనలో ఆరుగురు మృతి

ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర ఖర్కీవ్ లోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఉన్న రష్యన్ బలగాలు ఎస్ -300 క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో రెండు పోస్టల్ డిపోపై పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Russia Strikes Ukraine : ఉక్రెయిన్ పై రష్యా మరోసారి క్షిపణి దాడి.. పోస్టల్ డిపోపై దాడి ఘటనలో ఆరుగురు మృతి

Russia Strikes Ukraine

Russia Vs Ukraine War: ఒకవైపు ఇజ్రాయెల్ – హమాస్ భీకర పోరు కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో సద్దుమణిగిందనుకున్న ఉక్రెయిన్ – రష్యా వార్ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా రష్యా సైన్యం మరోసారి ఉక్రెయిన్ పై దాడికి పాల్పడింది. ఆ దేశంలోని ఖర్కీవ్ లో ఉన్న పోస్టల్ డిపో భవనంపై క్షిపణి ప్రయోగించింది. దీంతో డిపో భవనం ధ్వంసమైంది. అందులో పనిచేస్తోన్న ఆరుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. భవనం శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భవనం శిథిలా కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు.

Read Also : Nambi Narayanan: ఈ పరీక్ష చాలా ముఖ్యం.. జీవితాలతో ఆట మరి..: గగన్‌యాన్‌పై ఇస్రో మాజీ శాస్త్రవేత్త

ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర ఖర్కీవ్ లోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఉన్న రష్యన్ బలగాలు ఎస్ -300 క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో రెండు పోస్టల్ డిపోపై పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతులంతా 19 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారని అధికారులు పేర్కొన్నారు.