Nambi Narayanan: ఈ పరీక్ష చాలా ముఖ్యం.. జీవితాలతో ఆట మరి..: గగన్‌యాన్‌పై ఇస్రో మాజీ శాస్త్రవేత్త

ఏది ఏమైనా వ్యోమగాములు ఏ సమస్యలూ లేకుండా ప్రాణాలతోనే తిరిగి భూమిమీదకు వస్తారని..

Nambi Narayanan: ఈ పరీక్ష చాలా ముఖ్యం.. జీవితాలతో ఆట మరి..: గగన్‌యాన్‌పై ఇస్రో మాజీ శాస్త్రవేత్త

Nambi Narayanan

Updated On : October 21, 2023 / 9:07 PM IST

Gaganyaan project: అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లేందుకు చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌‌లో భాగంగా శనివారం భారత్ చేపట్టిన తొలి పరీక్ష విజయవంతం కావడంపై ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ స్పందించారు. ఇవాళ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

గగన్‌యాన్ ప్రాజెక్టులో తొలి అడుగు ఫ్లైట్‌ టెస్ట్ వెహికిల్ అబార్ట్‌ మిషన్‌-1 స్పేస్‌క్రాఫ్ట్ పరీక్షలో గొప్ప విజయం సాధించామని నంబి నారాయణన్ చెప్పారు. ఇస్రో డిజైన్ చేసిన ఎస్కేప్ మాడ్యూల్స్ కు సంబంధించిన సమర్థతను, పనితీరును పరిశీలించడంలోని మన సామర్థ్యాలను ఈ పరీక్ష స్పష్టం చేస్తోందని అన్నారు.

ఇది చాలా ముఖ్యమైన మాడ్యూల్ అని, ఎందుకంటే గగన్‌యాన్ మొత్తం ప్రక్రియలో మనం జీవితాలతో ఆడుకుంటున్నామని నంబి నారాయణన్ అన్నారు. ఏది ఏమైనా వ్యోమగాములు ఏ సమస్యలూ లేకుండా ప్రాణాలతోనే తిరిగి భూమిమీదకు వస్తారని వ్యాఖ్యానించారు. ఇస్రో శాస్త్రవేత్తలు రెండేసిసార్లు సమర్థతను పరీక్షిస్తున్నారని చెప్పారు. చిన్న సమస్య వల్ల నేటి పరీక్షలో కాస్త ఆలస్యమైందని తెలిపారు. అన్ని దశలనూ చాలా జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.

Gaganyaan Mission Success : గగన్ యాన్ మిషన్ టీవీడీ-1 ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్