Leo OTT : లియో ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్‌..! ఎప్పుడంటే..?

త‌ల‌ప‌తి విజ‌య్ న‌టించిన సినిమా లియో. లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌. అక్టోబ‌ర్ 19న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Leo OTT : లియో ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్‌..! ఎప్పుడంటే..?

Vijay Leo Ott

Leo OTT Release : త‌ల‌ప‌తి విజ‌య్ న‌టించిన సినిమా లియో. లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌. అక్టోబ‌ర్ 19న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన‌ ఆరు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.450 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది. రూ.500 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టేందుకు ఉర‌క‌లు వేస్తోంది.

ఈ సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో న‌టించారు. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Nikhil Siddhartha : ‘స్పై’ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే రిలీజ్ చేశారు.. నిఖిల్ అసహనం..

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్స్ సొంతం చేసుకుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా థియేట‌ర్‌లో విడుద‌లైన నెల‌రోజుల త‌రువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నార‌ట‌. ఈ లెక్క‌న ఈ చిత్రాన్ని నవంబ‌ర్ 21 స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. అయితే.. దీనిపై చిత్ర బృందం అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని అంటున్నారు.