Badruddin Ajmal : అత్యాచారం, దోపిడీ కేసుల్లో ముస్లింలు నంబర్ వన్…అసోం ముస్లిం నేత బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముస్లింలపై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లూటీలు,దోపిడీలు,అత్యాచారాల వంటి నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లడంలో ముస్లింలు నంబర్ వన్ అని బద్రుద్దీన్ వ్యాఖ్యానించి వివాదాన్ని రేకెత్తించారు.....

Badruddin Ajmal : అత్యాచారం, దోపిడీ కేసుల్లో ముస్లింలు నంబర్ వన్…అసోం ముస్లిం నేత బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు

Badruddin Ajmal

Badruddin Ajmal : ముస్లింలపై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లూటీలు,దోపిడీలు,అత్యాచారాల వంటి నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లడంలో ముస్లింలు నంబర్ వన్ అని బద్రుద్దీన్ వ్యాఖ్యానించి వివాదాన్ని రేకెత్తించారు. చదువు లేనందువల్ల ముస్లింలు అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read :  Harish Rao : మళ్లీ కేసీఆర్ రాకుంటే.. అమరావతిలా హైదరాబాద్- మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో ఏఐయూడీఎఫ్ కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలున్నారు. ముస్లిం పిల్లలు మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయలేక పోతున్నారని బద్రుద్దీన్ బాధ వ్యక్తం చేశారు. విద్య లేమి వల్ల అధిక నేరాల రేటుకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : DIG Ravi Kiran : మావోయిస్టుల లేఖ, చంద్రబాబు భద్రత, కంటికి ఆపరేషన్‌పై జైళ్ల శాఖ డీఐజీ కీలక వ్యాఖ్యలు

యువకులు బహిరంగ ప్రదేశాల్లో మహిళలను చూసినపుడు తమ కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారని గుర్తుంచుకోవాలని, వారు తమ తల్లులు, సోదరీమణుల గురించి ఆలోచిస్తే లైంగికవేధింపులకు పాల్పడరని ఆయన పేర్కొన్నారు. ముస్లిం సమాజం అభివృద్ధి చెందక పోవడానికి అక్షరాస్యత తక్కువగా ఉండటమే కారణమని ముస్లిం నేత చెప్పారు. నేరాలు చేసి జైళ్లకు వెళ్లే వారిలోముస్లింలు నంబర్ వన్ అని బద్రుద్దీన్ వ్యాఖ్యానించారు. ముస్లిం యువకులు విద్య, ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలని బద్రుద్దీన్ సూచించారు.