NZ vs PAK : ఒక్క సెంచ‌రీతో హీరో.. రివార్డు ప్ర‌క‌టించిన పీసీబీ.. ఎంతో తెలుసా..?

ఒకే ఒక్క సెంచరీతో ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌ పాకిస్థాన్ దేశంలో హీరోగా మారాడు. ప్ర‌స్తుతం అత‌డి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

NZ vs PAK : ఒక్క సెంచ‌రీతో హీరో.. రివార్డు ప్ర‌క‌టించిన పీసీబీ.. ఎంతో తెలుసా..?

Fakhar Zaman

New Zealand vs Pakistan : ఒకే ఒక్క సెంచరీతో ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌ పాకిస్థాన్ దేశంలో హీరోగా మారాడు. ప్ర‌స్తుతం అత‌డి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అంతేనా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అయితే ఓ అడుగు ముందుకు వేసి అత‌డికి ఏకంగా ఒక మిలియ‌న్ రివార్డును ప్ర‌క‌టించింది. ఓ సెంచ‌రీకే ఇంత అతి చేయాలా అని మీరు ఆశ్చ‌ర్య‌పోవ‌చ్చు. కానీ అది అలాంటి ఇలాంటి సెంచ‌రీ కాదు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో కొండంత ల‌క్ష్యం క‌ళ్ల ముందు ఉన్న‌ప్పుడు సాధించిన సెంచ‌రీ.

బెంగళూరు వేదిక‌గా శ‌నివారం పాకిస్థాన్ జ‌ట్టు న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన కివీస్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు న‌ష్ట‌పోయి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108; 94 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) సెంచ‌రీ చేశాడు. కేన్ విలియమ్సన్ (95; 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ వాసిం జూనియర్ మూడు వికెట్లు పడగొట్టాడు. హసన్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్ త‌లా ఓ వికెట్ సాధించారు.

Happy Birthday Virat Kohli: కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ఎవరెవరు విషెష్ చెప్పారంటే.. ట్వీట్లు వైరల్

కొండంత ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్థాన్ బ‌రిలోకి దిగింది. 25.3 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టపోయి 200 ప‌రుగులు చేసింది. ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (126; నాటౌట్ 81 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్స‌ర్లు) మెరుపు శ‌త‌కం, బాబ‌ర్ ఆజాం (63 నాటౌట్; 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో ఊపుమీదున్నారు. ఈ స‌మ‌యంలో వ‌ర్షం వ‌చ్చింది. ఎంత‌సేప‌టికి త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిని అనుస‌రించి పాకిస్థాన్ విజేత‌గా ప్ర‌క‌టించారు.

డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తి ప్ర‌కారం 25.3 ఓవ‌ర్ల ఆట పూర్తి అయ్యే స‌రికి 179 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా పాకిస్థాన్ మ‌రో 21 ప‌రుగులు అద‌నంగా చేసింది. దీంతో 21 ప‌రుగుల తేడాతో పాక్ గెలిచిన‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పాకిస్థాన్ సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉన్నాయి. మెరుపు శ‌త‌కం సాధించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించినందుకు గాను ఫ‌ఖ‌ర్‌కు పీసీబీ 10ల‌క్ష‌ల పాకిస్థాన్ రూపాయ‌ల‌ను బ‌హుమ‌తిగా ప్ర‌క‌టించింది. ఆ జ‌ట్టు మాజీలు, అభిమానులు అత‌డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ODI World Cup 2023 : వరల్డ్ కప్ మ‌న‌దేనా..? రోహిత్ శ‌ర్మ‌ను ప్ర‌శ్నించిన ఫ్యాన్‌.. స‌మాధానం ఏంటో తెలుసా..?