Bigg Boss 7 Day 64 : ఈ సారి నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? బిగ్‌బాస్ మహారాజ్యంలో సరికొత్తగా నామినేషన్స్ ప్రక్రియ..

ఈసారి నామినేషన్స్ ని సరికొత్తగా డిజైన్ చేశాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ మహారాజ్యం అని చెప్పి శోభా, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా నియమించాడు.

Bigg Boss 7 Day 64 : ఈ సారి నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? బిగ్‌బాస్ మహారాజ్యంలో సరికొత్తగా నామినేషన్స్ ప్రక్రియ..

Bigg Boss 7 Day 64 Highlights This week Nominations

Bigg Boss 7 Day 64 : బిగ్‌బాస్ తొమ్మిది వారాలు అయిపోయి పదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆదివారం ఎపిసోడ్ లో తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం అంటేనే నామినేషన్స్ డే. కంటెస్టెంట్స్ అంతా ఒకరి మీద ఒకరు ఫైర్ అయ్యే డే. ఈసారి నామినేషన్స్ ని సరికొత్తగా డిజైన్ చేశాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ మహారాజ్యం అని చెప్పి శోభా, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా నియమించాడు.

మిగిలిన వాళ్ళు ఇద్దరిద్దరుగా వచ్చి ఒక్కొక్కరిని నామినేట్ చేయాలని. అందులో రాజమాతలకు ఎవరి నామినేషన్ కరెక్ట్ అనిపిస్తే వాళ్ళని నామినేట్ చేస్తారని షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్స్ కత్తులు తీసుకొని ఎవర్ని నామినేట్ చేయాలో చెప్పాలి అన్నారు. గత వారంలాగే ఈ వారం కూడా శివాజీ బ్యాచ్ అమర్ దీప్ ని టార్గెట్ చేసి నామినేట్ చేయడానికి ప్రయత్నించినా రాజమాతలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

మొదట అమర్ .. భోలేని, అర్జున్.. గౌతమ్ ని నామినేట్ చేయగా.. రాజమాతలు భోలేని నామినేట్ చేశారు.
యావర్.. అమర్ ని, ప్రశాంత్.. గౌతమ్ ని నామినేట్ చేయగా.. రాజమాతలు గౌతమ్ ని నామినేషన్స్ కి పంపారు.
భోలే.. అమర్ ని, గౌతమ్.. శివాజీని నామినేట్ చేయగా.. రాజమాతలు శివాజీని నామినేట్ చేశారు. ఈ క్రమంలో ప్రియాంక అమర్ కి సపోర్ట్ గా భోలేతో గొడవ పడ్డాడు. శివాజీ కూడా తనని నామినేట్ చేయడంతో ప్రియాంక, శోభలతో గొడవ పడ్డాడు.

ఈ గొడవల్లో అశ్విని దూరడంతో ఆమెని ఎవ్వరూ పట్టించుకోకపోగా శోభా, ప్రియాంక ఆమె మీద ఫైర్ అవ్వడంతో ప్రియాంక ఏడ్చేసి వాళ్లకి దండం పెట్టింది. దీంతో ఆ ఇద్దరు నటించింది చాలని హడావిడి చేశారు. అనంతరం శివాజీ.. అమర్ ని, యావర్ కూడా అమర్ ని టార్గెట్ చేసి నామినేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ బిగ్‌బాస్ ఇద్దరూ ఒక్కర్నే నామినేట్ చేయకూడదు, ఎవర్ని నామినేట్ చేయకపోతే వాళ్లే నామినేట్ అవుతారు అనడంతో యావర్ నామినేట్ అయ్యాడు.

Also Read : Bigg Boss 7 Day 63 : ఎలిమినేట్ అయిన తేజ.. నువ్వు లేకుండా ఉండలేను అంటూ ఏడ్చేసిన ఆ లేడీ కంటెస్టెంట్..

ఇక చివర్లో రాజమాతలు అందరూ వాళ్ళల్లో వాళ్ళు నామినేషన్స్ చేసుకొని చివరికి ఒకర్ని నామినేట్ చేయాలి అన్నాడు బిగ్‌బాస్. రతిక, అశ్విని.. ప్రియాంకని నామినేట్ చేయగా, ప్రియాంక, శోభా.. రతికని నామినేట్ చేశారు. ఇద్దరికీ టై అవ్వడంతో బిగ్‌బాస్ కెప్టెన్ శోభాని వాళ్ళిద్దరిలో ఒకర్ని నామినేషన్స్ కి పంపించామన్నారు. దీంతో శోభా తన ఫ్రెండ్ ప్రియాంకను సేవ్ చేసి రతికని నామినేట్ చేసింది. దీంతో రతిక ఏడ్చేసింది. మొత్తంగా ఈవారం నామినేషన్స్ లో భోలే శావళి, శివాజీ, గౌతమ్,యావర్, రతికలు ఉన్నారు.