ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ ప్లేయర్స్ హవా.. అగ్రస్థానంకు దూసుకెళ్లిన శుభ్మన్ గిల్, సిరాజ్
వన్డే ప్రపంచ కప్ 2023లో అదరగొడుతున్న టీమ్ఇండియా ఐసీసీ ర్యాంగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ప్రపంచ వన్డే నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది.
Shubman Gill : వన్డే ప్రపంచ కప్ 2023లో అదరగొడుతున్న టీమ్ఇండియా ఐసీసీ ర్యాంగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ప్రపంచ వన్డే నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ భారత్ ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలిచారు. బుధవారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ను వెనక్కినెట్టి వన్డే ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీ తరువాత భారత దేశం నుంచి ప్రపంచ నెం.1 బ్యాటర్ గా నిలిచిన నాలుగో ప్లేయర్ గా గిల్ ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంకు చేరుకోగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెం. 1 ర్యాంక్ సాధించిన భారత్ కు చెందిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును శుభ్మన్ గిల్ బద్దలు కొట్టాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో ప్రపంచ నెం.1 బౌలర్ గా టీమిండియా పాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిలిచాడు. ఈ విభాగంలో భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ (మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్ కు చేరుకున్నాడు), జస్ప్రీత్ బుమ్రా (మూడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు), మహ్మద్ షమీ (ఏడో స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకు)లో ఉన్నాడు. ఆల్ రౌండ్ విభాగంలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 10వ స్థానంలో నిలిచాడు.
No.1 team – India.
No.1 batter – Gill.
No.1 bowler – Siraj.
No.4 batter – Kohli.
No.4 bowler – Kuldeep.
No.6 batter – Rohit.
No.8 bowler – Bumrah.
No.10 bowler – Shami.
No.10 All Rounder – Jadeja.TEAM INDIA DOMINANCE IN ODIS…!!! 🇮🇳 pic.twitter.com/dZEFX1mHdW
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 8, 2023
A big day for India's #CWC23 stars with two new No.1 players crowned in the latest @MRFWorldwide ICC Men's ODI Player Rankings 😲
Details 👇https://t.co/nRyTqAP48u
— ICC (@ICC) November 8, 2023