Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో స‌త్తా చాటిన భార‌త మ‌హిళా ఆర్చ‌రీ జ‌ట్టు.. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు

పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త మ‌హిళా ఆర్చ‌రీ జ‌ట్టు శుభారంభం చేసింది.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో స‌త్తా చాటిన భార‌త మ‌హిళా ఆర్చ‌రీ జ‌ట్టు.. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు

Paris Olympics 2024 Indian womens archery team qualifies quarterfinals

Indian womens archery team : పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త మ‌హిళా ఆర్చ‌రీ జ‌ట్టు శుభారంభం చేసింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు చేరుకుంది. భ‌జ‌న కౌర్‌, దీపిక కుమారిల‌తో పాటు అంకిత భ‌క‌త్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో భార‌త్ టాప్‌-4లో నిలిచింది. ఈ ముగ్గురు ఆర్చ‌ర్లు క‌లిసి 1983 పాయింట్లు సాధించారు. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో భార‌త మ‌హిళా ఆర్చ‌రీ జ‌ట్టు ప్రాన్స్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ విజేత‌తో త‌ల‌ప‌డాల్సి ఉంటుంది. ఒక‌వేళ భార‌త్ క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో విజ‌యం సాధిస్తే కొరియాతో త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంటుంది.

వ్య‌క్తిగ‌త విభాగంలో అంకిత తృటిలో టాప్‌-10లో చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. 666 పాయింట్ల‌తో 11వ స్థానంలో నిలిచింది. వెటరన్ దీపిక 658 పాయింట్లతో 23వ స్థానంలో నిలవగా, భజన్ కౌర్ 659 స్కోరుతో 22వ స్థానంలో నిలిచింది.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌2024లో భారత్‌ పూర్తి షెడ్యూల్ ఇదే.. పతకాల వేట నేటి నుంచే షురూ..

దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌ఐఎం సిహియోన్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో 12 రౌండ్లు ముగిసేసరికి 694 స్కోరుతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో కూడా దక్షిణ కొరియా ఒలింపిక్ రికార్డ్ 2046 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనా 1966 పాయింట్లు, మెక్సికో జట్టు 1986 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత మహిళా ఆర్చర్ల ప్రదర్శన:

వ్యక్తిగత
దీపికా కుమారి – 658 (23వ స్థానం)
భజన్ కౌర్ – 659 (22వ స్థానం)
అంకిత భకత్ – 666 (11వ స్థానం)

Suryakumar Yadav : శ్రీలంక‌తో టీ20 సిరీస్‌కు ముందు సూర్య‌కు రింకూ సింగ్ స్పెష‌ల్ రిక్వెస్ట్‌..

జట్టుగా..
భారతదేశం – 1986 (4వ స్థానం)