ODI World Cup 2023 : ఆ మూడు జట్లలో సెమీస్ లో టీమిండియాతో తలపడే జట్టు ఏదో ఇలా తెలుసుకోండి ..

ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాల్గో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో పాకిస్థాన్, ఆరో స్థానంలో అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.

ODI World Cup 2023 : ఆ మూడు జట్లలో  సెమీస్ లో టీమిండియాతో తలపడే జట్టు ఏదో ఇలా తెలుసుకోండి ..

Team india

Updated On : November 8, 2023 / 1:16 PM IST

ODI World Cup 2023 Semi Final Teams: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు వెళ్లాయి. నాల్గో స్థానం కోసం అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. భారత్ జట్టు ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో సెమీస్ లో నాల్గో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ తలపడుతుంది. పాక్, కివీస్, అఫ్గానిస్థాన్ జట్లలో ఏ జట్టు భారత్ తో తలపడే అవకాశం ఉందో ఓ సారి పరిశీలిద్దాం.

Also Read : Mohammed shami : వరల్డ్ కప్ లో షమీ అద్భుత ప్రదర్శనపై మాజీ భార్య షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాల్గో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో పాకిస్థాన్, ఆరో స్థానంలో అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. ఈ జట్లలో ఈనెల 9న (గురువారం) న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో తలపడుతుంది. ఈనెల 10(శుక్రవారం)న అఫ్గానిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. ఈనెల 11న (శనివారం)పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ తో తలపడుతుంది.

Also Read : Glenn Maxwell : బాబోయ్ వీరబాదుడు బాదాడు.. వాంఖడే స్టేడియంలో మ్యాక్స్‌వెల్‌ విశ్వరూపం.. ఈ వీడియో చూడండి

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ..
– టీమిండియాతో సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ తలపడాలంటే న్యూజిలాండ్ జట్టు శ్రీలంకను ఓడించాలి.
– పాకిస్థాన్ జట్టుపై ఇంగ్లాండ్ విజయం సాధించాలి.
– ఒకవేళ ఇంగ్లాండ్ పై పాకిస్థాన్ విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టు 130 పరుగుల కంటే మించి ఎక్కువ పరుగులతో ఓడిపోకూడదు.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ..
– టీమిండియాతో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్స్ లో తలపడాలంటే ఇంగ్లాండ్ జట్టుపై పాకిస్థాన్ విజయం సాధించాలి.
– శ్రీలంక జట్టుపై న్యూజిలాండ్ ఓడిపోవాలి. లేదా మ్యాచ్ టై, రద్దు కావాలి.
– ఒకవేళ శ్రీలంకపై న్యూజిలాండ్ గెలిస్తే. ఇంగ్లాండ్ పై పాకిస్థాన్ 130 పరుగులకుపైగా తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.

ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ ..
– టీమిండియాతో సెమీఫైనల్స్ లో అఫ్గానిస్థాన్ తలపడాలంటే సౌతాఫ్రికా జట్టుపై అఫ్గానిస్థాన్ విజయం సాధించాలి.
– న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై ఓడిపోవాలి.
– పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై ఓడిపోవాలి.