AR Rahman : కొత్త వివాదంలో ఏఆర్ రెహ్మాన్.. భగ్గుమన్న బెంగాలీలు

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ పాట ట్యూన్ విషయంలో బెంగాలీల ఆగ్రహానికి గురయ్యారు.

AR Rahman : కొత్త వివాదంలో ఏఆర్ రెహ్మాన్.. భగ్గుమన్న బెంగాలీలు

AR Rahman

AR Rahman : ఏఆర్ రెహ్మాన్‌ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే చెన్నైలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ విషయంలో విమర్శలు ఎదుర్కున్నారు.  తాజాగా ఓ పాట విషయంలో ట్యూన్ మార్చారంటూ కొత్త చిక్కులు తెచ్చుకున్నారు.

Charan Upasana Diwali Party : టాలీవుడ్ సెలబ్రిటీలకు చరణ్ ఉపాసన దీపావళి స్పెషల్ ట్రీట్..

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌‌ను ఇటీవల వివాదాలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం చెన్నైలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ రసాభాసగా మారడంతో అర్ధాంతరంగా నిలిపివేయడం విమర్శలకు దారి తీసింది. అదలా ఉంటే తాజాగా ప్రముఖ బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రచించిన స్వాతంత్ర్యోద్యమ గీతం ‘కరార్ ఓయ్ లౌహో కొపట్’ ట్యూన్ మార్చేసారంటూ విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈ పాట ట్యూన్‌ను రీసెంట్ గా విడుదలైన ‘పిప్పా’ సినిమాలో రెహ్మాన్ వాడుకున్నారు. అందుకు నజ్రుం కుటుంబ సభ్యులు అనుమతి ఇచ్చినా.. దాని ట్యూన్, లయ పూర్తిగా మార్చేసారంటూ నజ్రుల్ మనవడు, మనవరాలు ఇతర కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

Tollywood Diwali : సింగిల్ ఫ్రేమ్‌లో మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇది కదా దీపావళి స్పెషల్ ట్రీట్..

రెహ్మాన్ పాటను తొలగించాలని నజ్రుం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ డొమైన్‌లో కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలని లేదంటే బెంగాలీ గాయకులు, కళాకారులతో నిరసనకు దిగుతామని వారు హెచ్చరించారు. దీనిపై బెంగాలీలు భగ్గుమంటున్నారు. రెహ్మాన్ ఇలాంటి పని చేస్తారని అసలు ఊహించలేదని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ సైతం విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో కూడా రెహ్మాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రెహ్మాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.