Ali Fazal – Richa Chadha : తండ్రి అయిన మీర్జాపూర్ నటుడు.. పండంటి పాపకు జన్మనిచ్చిన హీరోయిన్..

అలీ ఫజల్ - రిచా చద్దా జంట గతంలో తాము పేరెంట్స్ కాబోతున్నాము అని రిచా ప్రగ్నెన్సీ ప్రకటించారు.

Ali Fazal – Richa Chadha : తండ్రి అయిన మీర్జాపూర్ నటుడు.. పండంటి పాపకు జన్మనిచ్చిన హీరోయిన్..

Ali Fazal Richa Chadha Couple became Parents Welcome a Baby Girl

Updated On : July 20, 2024 / 12:56 PM IST

Ali Fazal – Richa Chadha : సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ లో గుడ్డు భాయ్ అందరికి గుర్తు ఉండే ఉంటాడు. ఇటీవలే సీజన్ 3 కూడా వచ్చింది. మీర్జాపూర్ సిరీస్ లో గుడ్డు భాయ్ గా చేసింది బాలీవుడ్ నటుడు అలీ ఫజల్. బాలీవుడ్ లో ఎప్పట్నుంచో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నా మీర్జాపూర్ తో మంచి ఫేమ్ వచ్చింది. అలీ ఫజల్ హీరోయిన్ రిచా చద్దాని 2022లో పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ లో గ్యాంగ్స్ ఆఫ్ వస్పూర్.. లాంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రిచా చద్దా.

Also Read : Trivikram – Vijay Bhaskar : హాట్ హీరోయిన్‌తో గురు శిష్యులు.. ఫొటో వైరల్.. ఒక్క ఫొటోతో ఆ రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్..

అలీ ఫజల్ – రిచా చద్దా జంట గతంలో తాము పేరెంట్స్ కాబోతున్నాము అని రిచా ప్రగ్నెన్సీ ప్రకటించారు. తాజాగా ఇటీవల జులై 16న రిచా చద్దా పండంటి పాపకు జన్మనిచ్చిందని సమాచారం. బాలీవుడ్ ప్రముఖులు కొంతమంది రిచా – అలీ ఫజల్ జంటకు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ జంట పండంటి పాపాయికి జన్మనిచ్చిందని తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో మీర్జాపూర్ గుడ్డు భాయ్ అభిమానులు కూడా ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.