High Court : ఎస్ఐ నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైకోర్టు పర్యవేక్షణలో ఎత్తు కొలిచేందుకు తమకు అభ్యంతరం లేదని 22మంది అభ్యర్థులు నిన్న అఫిడవిట్ దాఖలు చేశారు.

High Court : ఎస్ఐ నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

AP High Court (2)

High Court Key Orders : సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్ఐ) నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లు అందరూ సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు పర్యవేక్షణలో ఎత్తు కొలిచేందుకు తమకు అభ్యంతరం లేదని 22మంది అభ్యర్థులు నిన్న అఫిడవిట్ దాఖలు చేశారు. సోమవారం హైకోర్టు పర్యవేక్షణలో డిస్ క్వాలిఫై అయిన అభ్యర్థుల ఎత్తు అధికారులు కోలవనున్నారు.

గతంలో జరిగిన ఎస్ఐ నియమాకాల్లో ఎత్తు విషయలో తమకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ నియామకాలపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్లింది. దీనిపై నవంబర్ 24న విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది.

అంతేకాకుండా దీనిపై ఓ కమిటీ ఏర్పాటు చేస్తుందని, ఇందులో అభ్యర్థుల ఎత్తును తిరిగి కొలుస్తామని కూడా తెలిపింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయమూర్తి హైకోర్టుకు గతంలో అభ్యర్థులకు ఎత్తు కొలిచిన వీడియోను కూడా అందజేశారు. దీన్ని పరిశీలించి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఎత్తివేయాలని కోరారు. కానీ, హైకోర్టు డివిజన్ బెచ్ స్టే ఎత్తవేతకు నిరాకరించింది.

Also Read: కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా స్టిక్కర్లు వేసుకుని ప్రచారం.. సీఎం జగన్ పై పురంధరేశ్వరి ఫైర్

దీంతో పాటు ఎత్తుకు సంబంధించి అభ్యర్థులు నకిలీ ఆరోపణలు చేసినట్లు నిర్ధారణ అయితే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ హెచ్చరించింది. దీనిపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్లు అందరూ సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు పర్యవేక్షణలో డిస్ క్వాలిఫై అయిన అభ్యర్థుల ఎత్తును అధికారులు కోలవనున్నారు.