CPI Narayana : కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలతో మాకు సంబంధం లేదు: సీపీఐ నారాయణ

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుంది..అహంభావం ఓడిపోతుంది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ కు సరైనోడు రేవంత్ రెడ్డే అన్నారు.

CPI Narayana : కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలతో మాకు సంబంధం లేదు: సీపీఐ నారాయణ

CPI Narayana About Telangana Polling

CPI Narayana About Telangana Polling : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్యం గెలుస్తుందని.. అహంభావం ఓడిపోతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్ని సంస్థలు చెప్తున్నాయని.. కానీ కేటీఆర్ మాత్రం ఇదంతా ట్రాష్ అని అంటున్నారని తెలిపారు.
గెలుపు ధీమాతో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టిందని, కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ అహంతోనే ఒడిపోబోతున్నారని అన్నారు. పోలింగ్ కు వృద్ధులు కూడా తరలి వచ్చి ఓటు వేశారని కానీ యంగ్ స్టార్స్ ఓటు వేయలేదని విమర్శించారు. చంద్రబాబుకు ఓట్లు వస్తాయని గతంలో అనుకున్నారు.. కానీ ఆయనకు ప్రజలు నామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారని, ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. రేపు ప్రజాస్వామ్యం గెలుస్తుంది.. అహంభావం ఓడిపోతుందని వ్యాఖ్యానించారు.

Also Read: గెలిచిన అభ్యర్ధులను కాపాడుకునేందుకు.. కర్ణాటక క్యాంప్ రాజకీయాలకు టీ.కాంగ్రెస్ ప్లాన్..

అసెంబ్లీలో కేసీఆర్ నుంచి బహిష్కరించబడ్డ రేవంత్ రెడ్డి సభా నాయకుడిగా అసెంబ్లీకి వెళ్లనున్నారని అన్నారు. కేసీఆర్ కు సరిజొడి మోదీయే అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ కు తగిన సరిజోడి రేవంత్ అని, అతని చేతిలో గులాబీ బాస్ అవమానం పాలుకానున్నారని అన్నారు. పార్టీలో పదిమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటే ప్రజాస్వామ్యం బతికే ఉంది అన్నట్లు అనుకోవాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధి జరిగింది కేసీఆర్ అంటున్నారు.. కానీ కల్వకుంట్ల ఖజాన మాత్రం పెరిగిందని విమర్శించారు. BRS పై యువత, దళితులు తీవ్రమైన వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేసిన కొత్తగూడెంలో సీపీఎం శ్రేణులు తమకు సహకరించాయని వెల్లడించారు.