Animal Collections : బాలీవుడ్‌ని షేక్ చేసిన సందీప్ వంగా.. ఖాన్లని దాటిన కపూర్.. యానిమల్ మొదటి రోజు కలెక్షన్స్..
ముగ్గురు ఖాన్స్ ని మించి రాకపోయినా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ బాగానే కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు. కానీ రణబీర్ కపూర్.. ఖాన్స్ ని మించి కలెక్షన్స్ తెచ్చాడు.
![Animal Collections : బాలీవుడ్‌ని షేక్ చేసిన సందీప్ వంగా.. ఖాన్లని దాటిన కపూర్.. యానిమల్ మొదటి రోజు కలెక్షన్స్.. Animal Collections : బాలీవుడ్‌ని షేక్ చేసిన సందీప్ వంగా.. ఖాన్లని దాటిన కపూర్.. యానిమల్ మొదటి రోజు కలెక్షన్స్..](https://10tv.in/wp-content/uploads/2023/12/Animal-Movie.jpg)
Animal Movie First Day Collections
Animal Movie Collections : సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నాన్న ఎమోషన్స్ తో మాస్ యాక్షన్ జోడించి తెరకెక్కిన సినిమా ‘యానిమల్’. డిసెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజయింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది యానిమల్.
మొదట్నుంచి చివరి వరకు నడిపించిన నాన్న ఎమోషన్, మాస్ యాక్షన్ ఫైట్ సీన్స్, రణబీర్ యాటిట్యూడ్, రష్మికతో రణబీర్ రొమాన్స్.. ఇలా అన్ని ప్రేక్షకులని మెప్పించాయి. సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా మిగిలిన సినిమా అంతా దాన్ని కవర్ చేసేసింది. ముందు నుంచి యానిమల్ సినిమాపై ఉన్న అంచనాలను అందుకొని సక్సెస్ అయింది. ఇక యానిమల్ సినిమా కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని అంచనాలు వేశారు.
ముగ్గురు ఖాన్స్ ని మించి రాకపోయినా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ బాగానే కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు. కానీ రణబీర్ కపూర్.. ఖాన్స్ ని మించి కలెక్షన్స్ తెచ్చాడు. మొదటి రోజు యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అది కూడా వీకెండ్ కాని రోజు సినిమా రిలీజయి, సౌత్ లో పెద్దగా మార్కెట్ లేని హీరో ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం బాలీవుడ్ లో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. రణబీర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తే సందీప్ వంగా తన డైరెక్షన్ తో అదరగొట్టాడు.
Also Read : Tripti Dimri : యానిమల్ సినిమాలో రష్మికకు కంటే ఎక్కువగా ఈ హీరోయిన్ కి పేరొస్తుంది? ఎవరు ఈ హీరోయిన్?
యానిమల్ సినిమా ఇండియాలో మొదటి రోజు 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా ఓవర్సీస్ లో 50 కోట్ల వరకు కలెక్ట్ చేయడం గమనార్హం. షారుఖ్ ఖాన్ పఠాన్ మొదటి రోజు ఇండియాలో 57 కోట్లు, సల్మాన్ ఖాన్ టైగర్ 3 కేవలం 44 కోట్లు మొదటి రోజు కలెక్ట్ చేశాయి. దీంతో రణబీర్ కపూర్ ఖాన్స్ ని మించి సూపర్ స్టార్ అయ్యాడు బాలీవుడ్ లో. ఇక వీకెండ్ ఉండటం, పెద్ద సినిమాలు లేకపోవడం, సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో యానిమల్ మరింత భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుందని చెప్పొచ్చు.
#Animal Day 1 WW Gross – ₹ 116 Crs.. Official https://t.co/FWKd2W4uOv pic.twitter.com/jgqmLXL1PS
— Ramesh Bala (@rameshlaus) December 2, 2023