UNESCO : గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు.. ఆనందం వ్యక్తంచేసిన ప్రధాని మోదీ

గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు.

UNESCO : గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్బాకు యునెస్కో గుర్తింపు.. ఆనందం వ్యక్తంచేసిన ప్రధాని మోదీ

UNESCO.. Gujarat traditional Garba dance

UNESCO.. Gujarat traditional Garba dance  : గుజరాజత్ సంప్రదాయ నృత్యం గర్భా యునెస్కో గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (UNESCO) గుజరాత్ సంప్రదాయ నృత్య రూపమైన ‘గర్బా’ను డిసెంబర్ 6న యునెస్కో జాబితాలో చేర్చబడింది.

ఇప్పటికే భారత దేశం నుంచి పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు లభించింది. తాజాగా గుజరాత్ సంప్రదాయం నత్యం గర్భాకు కూడా యునెస్కో గుర్తింపు లభించటం విశేషాం. గర్భాకు యునెస్కో గుర్తింపు లభించిన విషయాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. ఇది గుజరాత్‌ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.

గర్భాకు అభించిన ఈ అరుదైన గుర్తింపుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అనే విషయం తెలిసిందే. గుర్భాకు యునెస్కో గుర్తింపు లభించటం పట్ల ఆయన ఆనందం వ్యక్తంచేశారు. భారత సంస్కృతిని ప్రపంచానికి చూపేందుకు ఇది గొప్ప అవకాశమని.. మన వారసత్వాన్ని భవిష్యత్తు తరాల కోసం సంరక్షించడానికి ఈ గౌరవం స్ఫూర్తినిస్తుందని చెప్పారు.గర్బా అనేది జీవితం, ఐక్యత మరియు మన లోతైన సంప్రదాయాల వేడుక అని పేర్కొన్నారు.