Rinku Singh : రింకూ సింగ్‌ దెబ్బ నుంచి తృటిలో త‌ప్పించుకున్న వారు ఏమ‌న్నారో తెలుసా..?

రింకూ కొట్టిన సిక్స్ అద్దాన్ని తాకిన స‌మ‌యంలో ఆ రూమ్‌లో బీసీసీఐ కంటెంట్ మేనేజ‌ర్ రాజ‌ల్ ఆరోరా, బీసీసీఐ మీడియా మేనేజ‌ర్ మౌలిన్ పారిఖ్ అక్క‌డే ఉన్నారు.

Rinku Singh : రింకూ సింగ్‌ దెబ్బ నుంచి తృటిలో త‌ప్పించుకున్న వారు ఏమ‌న్నారో తెలుసా..?

Survivors Of Rinku Viral 6 That Broke Glass Panel Are Shaken

Survivors Of Rinku Singh : ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాది 68 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. అత‌డు కొట్టిన రెండు సిక్స‌ర్ల‌లో ఓ సిక్స్ మీడియా ప్ర‌తినిధులు కూర్చున్న రూమ్ గ్లాస్‌ను అద్దాన్ని బ‌ద్ద‌లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా.. రింకూ కొట్టిన సిక్స్ అద్దాన్ని తాకిన స‌మ‌యంలో ఆ రూమ్‌లో బీసీసీఐ కంటెంట్ మేనేజ‌ర్ రాజ‌ల్ ఆరోరా, బీసీసీఐ మీడియా మేనేజ‌ర్ మౌలిన్ పారిఖ్ అక్క‌డే ఉన్నారు.

దీనిపై పారిక్ మాట్లాడుతూ.. ‘రింకూ సింగ్‌కు ఇది టీ20ల్లో మొద‌టి హాఫ్ సెంచ‌రీ. ఇది అత‌డికి జీవితకాలం గుర్తుకు ఉంటుంది. బంతి ఇక్క‌డే ప‌డింది. ఆ స‌మ‌యంలో పెద్ద శ‌బ్ధం వ‌చ్చింది. కిటికి మూసివేసి ఉండ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. మేము అదృష్ట వంతులం.’ అని పారిఖ్ అన్నారు.

Out or Not out : ఔటా..? నాటౌటా..? త‌ల‌ప‌ట్టుకున్న అంపైర్లు..! జ‌ర మీరే చెప్పండి సామి..

బంతి అద్దాన్ని తాకుతుంద‌ని తాను ఊహించ‌లేద‌ని రాజ‌ల్ చెప్పారు. బంతి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కింద‌ప‌డిపోతుంద‌ని తాము బావించిన‌ట్లు తెలిపారు. ఆ స‌మ‌యంలో రెండు కిటికీలు తెరిచి ఉన్నాయి. ఇది మాత్ర‌మే మూసి ఉంది. నిజంగా మూసి ఉన్న‌దానిపై బాల్ త‌గ‌లడంతో బ‌తికి పోయాం. మేము బాగానే ఉన్నాం అని అన్నారు.

ఆ ప‌క్క‌నే ఉన్న క్రికెట్ సౌతాఫ్రికా మీడియా మేనేజ‌ర్ లూసి మాట్లాడుతూ.. బంతి త‌గిలిన చోటు ద‌గ్గ‌ర‌కు తానే కూర్చోని ఉన్న‌ట్లు చెప్పింది. కొంచెం కంగారు ప‌డిన‌ట్లు తెలిపింది. దేవుడి ద‌య వ‌ల్ల తాను, త‌న ల్యాప్‌టాప్ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఆమె న‌వ్వుతూ చెప్పింది.

Tom Curran : మంట‌ను చూసి భ‌య‌ప‌డిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌..! కొద్దిలో మిస్సైంది మామా..!

తాను కొట్టిన సిక్స‌ర్ వ‌ల్ల‌ మీడియా బాక్స్ అద్దం ప‌గ‌ల‌డం పై ఇప్ప‌టికే రింకూ స్పందించాడు. అందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. తాను కావాల‌ని ఇది చేయ‌లేద‌ని, సిక్స‌ర్ కోసం మాత్ర‌మే ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత‌ బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 19.3 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 180 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత వ‌ర్షం వ‌చ్చింది. దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ద‌క్షిణాఫ్రికా ల‌క్ష్యాన్ని 15 ఓవ‌ర్ల‌కు 152 ప‌రుగుల‌కు కుదించారు. ఈ ల‌క్ష్యాన్ని ద‌క్షిణాఫ్రికా 13.5 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.