Ruhani Sharma : విరాట్ కోహ్లీ ఈ హీరోయిన్ కి బావ అంట.. ఎలా? విరాట్ గురించి ఏమని చెప్పింది?
తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి రుహాణి రాగా 10 టీవీ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
Ruhani Sharma : హీరోయిన్ రుహాణి శర్మ ఓ తమిళ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చి తెలుగులో చిలసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులని మెప్పించింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది. అడపాదడపా వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. ఈ సంక్రాంతికి తెలుగులో సైంధవ్ సినిమాతో రాబోతుంది.
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా చేసిన సైంధవ్(Saindhav) సినిమా జనవరి 13న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమాలో రుహాణి శర్మ ఓ డాక్టర్ పాత్ర చేసింది. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి రుహాణి రాగా 10 టీవీ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
రుహాణి శర్మ మాట్లాడుతూ.. వెంకటేష్(Venkatesh) గారివి చాలా సినిమాలు చూశాను. ఎక్కువగా హిందీ డబ్బింగ్ సినిమాలు చూశాను. వెంకటేష్ గారంటే అభిమానం ఉంది. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నా. కానీ తర్వాత నా డ్రీమ్ మారిపోయి ఇలా యాక్టర్ అయ్యాను. సైంధవ్ సినిమాలో డాక్టర్ గా చేయడం ఆనందంగా అంది. ఇలా అయినా నా చిన్నప్పటి డ్రీం నెరవేరింది అని చెప్పింది.
Also Read : Mahesh Babu : థ్యాంక్యూ గుంటూరు.. మహేష్, నమ్రత ఎమోషనల్ పోస్టులు..
ఇక బాలీవుడ్ భామ అనుష్క శర్మ(Anushka Sharma) తనకి సిస్టర్ అవుతుంది, విరాట్(Virat Kohli) బావ అవుతాడు కదా అని అడగ్గా.. అవును, ఇది సీక్రెట్. నా పర్సనల్స్ ఎప్పుడు నేను చెప్పలేదు. మీకెలా తెలిసింది? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అనుష్క శర్మ నాకు సిస్టర్ అవుతుంది. విరాట్ కోహ్లీ బావ అవుతారు. విరాట్ చాలా మంచివాడు. నాతో బాగానే ఉంటాడు. వాళ్ళు అందరితో చాలా మంచిగా ఉంటారు, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా సింపుల్ గా ఉంటారు. అందుకే వాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం అని తెలిపింది. దీంతో హీరోయిన్ రుహాణి శర్మకి అనుష్క శర్మ అక్క అవుతుంది, విరాట్ బావ అవుతాడు అని తెలియడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.