వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్

2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషన్ కు ఎంపిక కావడం విశేషం.

వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్

Padma Vibhushan For Megastar Chiranjeevi And Venkaiah Naidu

Megastar Chiranjeevi And Venkaiah Naidu : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలను దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. పద్మ పురస్కారాల జాబితాలో పద్మ విభూషన్ అవార్డుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి ఎంపికయ్యారు. 2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషన్ కు ఎంపిక కావడం విశేషం.

మెగాస్టార్‌ చిరంజీవి, వెంకయ్యనాయుడు సహా ఐదుగురికి పద్మ విభూషణ్‌ను ప్రకటించింది కేంద్రం. కళారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గానూ.. కొణిదెల చిరంజీవి(ఆంధ్రప్రదేశ్‌), వైజయంతిమాల (తమిళనాడు ), పద్మ సుబ్రహ్మణ్యం (తమిళనాడు ), ప్రజా వ్యవహారాల్లో వెంకయ్యనాయుడు (ఆంధ్రప్రదేశ్‌), సామాజిక సేవకుగానూ బీహార్‌కు చెందిన బిందేశ్వర పాఠక్‌ (మరణానంతరం)ను రెండో అత్యున్నత పురస్కారం వరించింది.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024 ఏడాదికి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. మొత్తం 132 మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో ఐదుగురికి పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి.

వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 8మంది ఉన్నారు. పద్మవిభూషణ్ పురస్కారం ఇద్దరు తెలుగువారికి దక్కింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక, తెలంగాణలో ఐదుగురికి, ఏపీలో ఒకరికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, వేణు ఆనందాచారి, కేతావత్ సోమ్ లాల్, కూరెళ్ల విట్టలాచార్య పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇక ఏపీ నుంచి హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకోనున్నారు.

 

* పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
* 2024 సంవత్సరానికి 132 మందికి పద్మ అవార్డులు
* ఐదుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలు
* 17 మందికి పద్మభూషణ్ అవార్డులు
* 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు
* తెలుగు వారికి 8 పద్మ అవార్డులు
* ఇద్దరికి పద్మవిభూషణ్, ఆరుగురికి పద్మశ్రీ
* ఏపీకి 2 పద్మవిభూషణ్ పురస్కారాలు, ఒక పద్మశ్రీ పురస్కారం
* తెలంగాణకు 5 పద్మశ్రీ పురస్కారాలు
* పద్మవిభూషన్ : వెంకయ్య నాయుడు, చిరంజీవి
* పద్మశ్రీ : వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోంలాల్, కూరెళ్ల విట్టలాచార్య(తెలంగాణ), డి. ఉమా మహేశ్వరి
* ఉమా మహేశ్వరి – ఏపీకి చెందిన హరికథ కళాకారిణి