CBSE Boards Exams 2024 : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 10వ తరగతి హిందీ రెండు పరీక్షల కోసం గైడ్‌లైన్స్ విడుదల

CBSE Board Exam Guidelines : ఫిబ్రవరి 21న నిర్వహించే సీబీఎస్ఈ 10వ తరగతి రెండు హిందీ పరీక్షల్లో ఎలాంటి తేడాలు జరగకుండా చూసేందుకు సెంటర్ సూపరింటెండెంట్లకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.

CBSE Boards Exams 2024 : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 10వ తరగతి హిందీ రెండు పరీక్షల కోసం గైడ్‌లైన్స్ విడుదల

CBSE Boards Exam : Guidelines Released For Hindi-A And Hindi-B Exams, Check Details

CBSE Board Exams 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 21, 2024న 10వ తరగతి హిందీ-ఎ, హిందీ-బి బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. ఈ రెండు పరీక్షలకు సంబంధించి బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెంటర్ సూపరింటెండెంట్‌లు, విద్యార్థులకు అనేక సూచనలు చేసింది. రేపు (బుధవారం) జరగబోయే పదో తరగతి హిందీ రెండు పరీక్షల్లో ఎలాంటి తేడాలు జరగకుండా చూసుకోవాలని సూచించింది.

Read Also : UPSC Civil Services Exam : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023 ఫేజ్ 3 ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదిగో.. పూర్తివివరాలివే!

నోటిఫికేషన్‌లో సూచించినట్టుగా..  హిందీ-ఎ హిందీ-బి అనే రెండు పరీక్షల సీటింగ్ ఏర్పాట్లు విడివిడిగా చేయాలి. పరీక్ష ముగిసిన తర్వాత రెండు పరీక్షల సమాధాన పత్రాలను విడివిడిగా ప్యాక్ చేయాలి. ఇంకా, విద్యార్థులు తమకు అందిన ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా చెక్ చేయాలని సూచించారు. విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టుల ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా అందించాలి.

సీబీఎస్ఈ బోర్డు నోటిఫికేషన్ ప్రకారం :

  • విద్యార్థులకు సబ్జెక్టు ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలి.
  • హిందీ-ఎ విద్యార్థులకు కలిపి సీట్లు కేటాయించాలి.
  • హిందీ-బి విద్యార్థులకు కలిపి సీట్లు కేటాయించాలి.
  • విద్యార్థులకు హిందీ-ఎ ప్రశ్నపత్రం ఇవ్వాలి.
  • విద్యార్థులకు హిందీ-బికి హిందీ-బి ప్రశ్నపత్రాన్నిఅందించాలి.
  • ప్రశ్న పత్రాల పంపిణీలో ఎలాంటి పొరపాటు జరగకూడదు.

పరీక్ష ముగిసిన తర్వాత.. జవాబు పత్రాలను కూడా హిందీ-ఎ, హిందీ-బిలతో విడివిడిగా ప్యాక్ చేయాలి. విద్యార్థుల అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న సబ్జెక్ట్ ఫైనల్, అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లో మాత్రమే హాజరు కావడానికి వారిని అనుమతించాలి. పరీక్షా కేంద్రం ద్వారా సబ్జెక్ట్ మార్చబడదు. పైన పేర్కొన్న విషయాలను కచ్చితంగా పాటించాలి.

సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు :
ఫిబ్రవరి 15న సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలతో పాటు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 13న ముగియనుండగా, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ముగుస్తాయి.

Read Also : CBSE Board Exams : టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు..!