NZ vs AUS : అది ఫీల్డ‌ర్ ప‌ట్టాల్సిన క్యాచ్‌.. గ్రౌండ్ మొత్తం నీదే అంటే ఎలా? వారి పొట్ట‌గొట్టొద్దు ప్లీజ్‌!

ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్ మాథ్యూవేడ్ ప‌ట్టిన క్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

NZ vs AUS : అది ఫీల్డ‌ర్ ప‌ట్టాల్సిన క్యాచ్‌.. గ్రౌండ్ మొత్తం నీదే అంటే ఎలా? వారి పొట్ట‌గొట్టొద్దు ప్లీజ్‌!

Matthew Wade stunning catch

New Zealand vs Australia : క్రికెట్‌లో ఓ నానుడి ఉంది. క్యాచులు ప‌డితే మ్యాచులు గెలిచిన‌ట్లేన‌ని. ఒక్కొసారి ఒక్క క్యాచ్ మిస్ చేసినా స‌రే మ్యాచ్ చేజారే ప్ర‌మాదం ఉంటుంది. అయితే.. ఇటీవ‌ల కాలంలో కొంద‌రు క్రికెట‌ర్లు అద్భుత‌మైన క్యాచులు అందుకుంటున్నారు. వారే ప‌ట్టే క్యాచులు న‌మ్మ‌శ‌క్యంగానీ విధంగా ఉంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్ మాథ్యూవేడ్ ప‌ట్టిన క్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఆక్లాండ్ వేదిక‌గా శుక్ర‌వారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జ‌ట్లు రెండో టీ20 మ్యాచులో త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.5 ఓవ‌ర్ల‌లో 174 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ (45), పాట్ క‌మిన్స్ (28), మిచెల్ మార్ష్ (26) లు రాణించారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో లోకీ ఫెర్గూస‌న్ నాలుగు వికెట్లు తీశాడు. బెన్ సియర్స్, మిచెల్ సాంట్న‌ర్‌, ఆడమ్ మిల్నే లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

IND vs ENG 4th Test : ‘అన్నా వీడికి హిందీ రాదు..’ స‌ర్ఫ‌రాజ్‌కు సూప‌ర్ పంచ్ ఇచ్చిన షోయ‌బ్ బ‌షీర్‌

175 ప‌రుగుల ల‌క్ష్యంతో న్యూజిలాండ్ బ‌రిలోకి దిగింది. కివీస్ ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌ను పాట్ క‌మిన్స్ వేశాడు. మొద‌టి బంతిని కివీస్ ఓపెన‌ర్ విల్ యంగ్ పుల్ షాట్ ఆడాడు. అయితే.. మిస్ టైమింగ్ కావ‌డంతో బంతి గాల్లోకి లేచింది. వెంట‌నే కీపింగ్ చేస్తున్న మాథ్యూవేల్‌.. బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ ప్రాంతం వైపు ప‌రిగెత్తుకుంటూ వెళ్లాడు. బంతి కింద ప‌డే స‌మ‌యంలో దూరంగా ఉన్న వేడ్ డైవ్ చేసి మ‌రీ బాల్‌ను అందుకున్నాడు. దీంతో ఐదు ప‌రుగుల‌కే చేసిన విల్ యంగ్ నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

అనంత‌రం కివీస్ బ్యాట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు చేర‌డంతో 17 ఓవ‌ర్ల‌లోనే 102 ప‌రుగుల‌కు న్యూజిలాండ్ కుప్ప‌కూలింది. దీంతో ఆస్ట్రేలియా 72 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో గ్లెన్ ఫిలిప్స్ (42) ఒక్క‌డే రాణించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా నాలుగు వికెట్ల‌తో కివీస్ ప‌తానాన్ని శాసించాడు. నాథ‌న్ ఎల్లిస్ రెండు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్‌, పాట్ క‌మిన్స్‌, మిచెల్ మార్ష్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Sachin : భూమండ‌లంపై ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి ఆట‌గాడు.. స‌రిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజు చరిత్రను తిరగరాసిన సచిన్

కాగా.. మాథ్యూవేడ్ ప‌ట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. అది ఫీల‌ర్ ప‌ట్టాల్సిన క్యాచ్‌.. నువ్వు ప‌డితే ఎలా..? వారి పొట్ట‌గొట్టొద్దు.. అంటూ నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.