Hardik Pandya : హార్దిక్ పాండ్య వ‌చ్చేశాడు.. నాలుగు నెల‌ల త‌రువాత పోటీ క్రికెట్‌లో..

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య మైదానంలో అడుగుపెట్టాడు.

Hardik Pandya : హార్దిక్ పాండ్య వ‌చ్చేశాడు.. నాలుగు నెల‌ల త‌రువాత పోటీ క్రికెట్‌లో..

Hardik Pandya

Pandya : భార‌త అభిమానుల‌కు శుభ‌వార్త ఇది. టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య మైదానంలో అడుగుపెట్టాడు. గాయం కార‌ణంగా దాదాపు నాలుగు నెల‌ల పాటు ఆట‌కు దూరంగా ఉన్న అత‌డు డివై పాటిల్ టీ20 టోర్న‌మెంట్‌లో పాల్గొంటున్నాడు. వ‌న్డే ప్ర‌పంచక‌ప్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ పాండ్య గాయ‌ప‌డ్డాడు. అత‌డి చీల‌మండ‌లానికి గాయ‌మైంది. ఈ గాయం కార‌ణంగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌, అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు.

దీంతో జూన్‌లో వెస్టిండీస్‌, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో హార్దిక్ ఆడ‌తాడా? లేడా? అనే సందేహం అంద‌రిలో మొద‌లైంది. అయితే.. గాయం నుంచి కోలుకున్న పాండ్య పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఐపీఎల్‌కు ముందు డివైపాటిల్ టోర్నీలో ఆడి ల‌య అందుకోవాల‌ని భావించాడు. ఈ టోర్నీలో అత‌డు రిలయ‌న్స్ 1 జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సోమ‌వారం రిల‌య‌న్స్ 1, భార‌త్ పెట్రోలియం (BPCL) జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది.

WPL 2024 : GG vs MI మ్యాచ్‌లో ఏమి జ‌రిగిందంటే?

రిలయన్స్ 1 లైనప్‌లో తిలక్ వర్మ, నేహాల్ వధేరా, ఆకాష్ మధ్వల్, పియూష్ చావ్లా వంటి వారు కూడా ఉన్నారు, వీరంతా ఐపీఎల్‌ 2024 సీజన్‌లో హార్దిక్ నేతృత్వంలోనే ఆడ‌నుండ‌డం గ‌మ‌నార్హం. BPCL జట్టులో సందీప్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్ వంటివారు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంత‌రంగా త‌ప్పుకున్న ఇషాన్ కిష‌న్ సైతం డివైపాటిల్ టీ20 టోర్న‌మెంట్ ఆడ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. అత‌డు ఆర్‌బీఐ త‌రుపున బ‌రిలోకి దిగ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Yashasvi Jaiswal : ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద‌.. కోహ్లి రికార్డు స‌మం..