Gold Price Today : ఆల్‌టైమ్‌ రికార్డు దిశగా దూసుకెళ్తున్న గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

బంగారం ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. గడచిన వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై సుమారు ..

Gold Price Today : ఆల్‌టైమ్‌ రికార్డు దిశగా దూసుకెళ్తున్న గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

Gold

Gold and Silver Latest Prices : బంగారం ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. గడచిన వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 2వేలు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కు తోడు, జూన్‌లో ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని ఊహాగానాల నేపథ్యంలో బంగారం ధర గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 700 పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 760 పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండిసైతం దూసుకెళ్తోంది. కిలో వెండిపై రూ. 1200 పెరిగింది. గడిచిన వారం రోజుల్లో కిలో వెండిపై రూ. 2,800 పెరుగుదల చోటు చేసుకుంది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,850 మార్క్ వద్దకు చేరింది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 65,000.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 59,450 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 64,850.
    చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.850 పెరగ్గా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 930 పెరిగింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,150 మార్క్ కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.65,620గా నమోదైంది.

Gold

  • భారీగా పెరిగిన వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 1200 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.78,200 మార్క్ కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 78,200 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.74,700 కాగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.