Cristiano Ronaldo : క‌న్నీళ్లు పెట్టుకున్న ఫుల్‌బాల్ దిగ్గ‌జం.. ఓట‌మి బాధ ఎవ్వ‌రికైనా ఒక‌టేగా..

ఆట‌లు ఏవైనా స‌రే అందులో గెలిచేందుకు క్రీడాకారులు త‌మ శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తుంటారు.

Cristiano Ronaldo : క‌న్నీళ్లు పెట్టుకున్న ఫుల్‌బాల్ దిగ్గ‌జం.. ఓట‌మి బాధ ఎవ్వ‌రికైనా ఒక‌టేగా..

Cristiano Ronaldo cries inconsolably after AFC champions league exit

Cristiano Ronaldo cried : ఆట‌లు ఏవైనా స‌రే అందులో గెలిచేందుకు క్రీడాకారులు త‌మ శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తుంటారు. ఆట‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జ‌మే అన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. కొన్ని సార్లు ప్లేయ‌ర్లు త‌మ భావోద్వేగాల‌ను నియంత్రించుకోలేరు. ఓ సాధార‌ణ ఆట‌గాడు అయినా, స్టార్‌ ప్లేయ‌ర్ అయినా.. ఎవ‌రైనా స‌రే ఓట‌మి బాధ కుంగ‌దీస్తుంటుంది. తాజాగా ప్ర‌ముఖ ఫుట్‌బాల్ దిగ్గ‌జం క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ ఓడిపోవ‌డంతో క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఏఎఫ్‌సీ చాంపియ‌న్స్ లీగ్‌లో క్రిస్టియానో రొనాల్డో నాయ‌క‌త్వంలో అల్ నాసర్ జ‌ట్టు బ‌రిలోకి దిగింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ఆ జ‌ట్టు అల్ ఐన్ జ‌ట్టుతో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఆఖ‌రి నిమిషంలో స్టార్ ఆట‌గాడు రొనాల్డో పెనాల్టీని గోల్‌గా మ‌లిచాడు. రొనాల్డో మిన‌హా మిగిలిన వాళ్లు విఫ‌లం కావ‌డంతో 3-1 తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ చేర‌కుండానే రొనాల్డో టీమ్ నిష్ర్క‌మించింది. ఈ ఓట‌మి రోనాల్డోను ఎంతో బాధించింది.

Mumbai Indians : ఐపీఎల్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్‌..!

మైదానంలోనే అత‌డు క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అల్ నాసర్ జట్టుకు ఎన్నో మ‌రుపురాని విజ‌యాల‌ను అందించిన రొనాల్డో క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం చూసిన అభిమానులు త‌ట్టుకోలేక‌పోయారు. రోనాల్డ్ క‌న్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజ‌న్లు ఆట‌ల్లో గెలుపోట‌లు స‌హ‌జ‌మ‌ని, చిన్న‌పిల్ల‌వాడిలా ఇలా క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం త‌గ‌ద‌ని కామెంట్లు చేస్తున్నారు.

PSL 2024 : అంపైర్‌తో నీకెందుకు సికింద‌ర్ మామ‌.. మ‌ధ్య‌లో వేలుపెడితివి! ఇప్పుడు చూడు..

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2022 అనంత‌రం సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ జ‌ట్టుతో రొనాల్డో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ రూ.4,400 కోట్లుగా ఉంది. అత‌డి నాయ‌క‌త్వంలో అల్‌నాస‌ర్ జ‌ట్టు సౌదీ ప్రో లీగ్‌లో విజేత‌గా నిలిచింది. అయితే.. ఏఎఫ్‌సీ చాంపియ‌న్స్ లీగ్‌లో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ఓడిపోయింది.