Poco X6 Neo 5G Sale : పోకో X6 నియో 5జీ ఫోన్ ఫస్ట్ సేల్.. అత్యంత సరసమైన ధరకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు!

Poco X6 Neo 5G Sale : ఆకట్టుకునే ఫీచర్‌లతో పోకో X6 లైనప్‌లో నియో ఫోన్‌ చేరింది. ఈ పోకో 5జీ ఫోన్‌ ఫస్ట్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమైంది. ఆసక్తిగల కొనుగోలుదారులు సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

Poco X6 Neo 5G Sale : పోకో X6 నియో 5జీ ఫోన్ ఫస్ట్ సేల్.. అత్యంత సరసమైన ధరకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు!

Poco X6 Neo 5G Sale in India

Poco X6 Neo 5G First Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? పోకో 5జీ ఫోన్ అత్యంత సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయిన పోకో ఎక్స్6 నియో 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు (సోమవారం) ప్రారంభమైంది. పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రోలు ఇప్పటికే ప్రవేశపెట్టగా.. ఈ సిరీస్‌లో మూడో ఫోన్‌గా పోకో ఎక్స్ 6 నియో ఫోన్ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో అందుబాటులోకి వచ్చింది.

పోకో ఎక్స్6 నియో ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్, 120హెచ్‌జెడ్ అమోల్డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన పెద్ద బ్యాటరీ, డ్యూయల్-కెమెరా సెటప్ ఉన్నాయి. పోకో ఎక్స్6 నియో భారత మార్కెట్లోకి రియల్‌మి 12 5జీ, లావా బ్లేజ్ కర్వ్ 5జీ వంటి ఫోన్లతో పోటీగా వచ్చింది.

Read Also : Vivo V30 Pro Series : కొత్త ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన కెమెరాలతో వివో V30 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

పోకో X6 నియో సేల్ ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో పోకో ఎక్స్6 నియో 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమైంది. పోకో ఎక్స్6 నియో 5జీ ఫోన్ ధర బేస్ మోడల్ 8జీబీ/128జీబీ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించింది. 12జీబీ/256జీబీ వేరియంట్‌ ధర రూ. 17,999కు అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, మార్టిన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

అంతేకాదు.. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్‌లను ఉపయోగించి పోకో X6 నియో 5జీ కొనుగోలు చేసే కస్టమర్‌లు ఇన్‌స్టంట్ రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా కేవలం రూ.8వేల ధరకే సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎక్స్6 నియో 5జీ స్పెసిఫికేషన్‌లు :
పోకో ఎక్స్ నియో 5జీ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6080 ఎస్ఓసీ ద్వారా 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజీతో వస్తుంది. 12జీబీ వరకు యూజ్ చేయని స్టోరేజీని వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించవచ్చు. పోకో హ్యాండ్‌సెట్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కూడా అందిస్తుంది. పోకో ఎక్స్6 నియో 5జీ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే 1,000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ ప్యానెల్ 120హెచ్ జెడ్‌రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉంది.

ఆకర్షణీయమైన డిస్‌ప్లే, 108ఎంపీ డ్యూయర్ కెమెరాలు :
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఎంఐయూఐ 14తో రన్ అవుతుంది. పోకో ఎక్స్6 నియో 5జీలో రెండు ప్రైమరీ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 108ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ అందిస్తుంది. ఫ్రంట్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. పోకో ఎక్స్6 నియో కూడా డాల్‌బై ఆట్మోస్, హెడ్‌ఫోన్ జాక్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌కు సపోర్టు ఇచ్చే మోనో స్పీకర్‌తో వస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

ఆకట్టుకునే ఫీచర్‌లతో వచ్చిన ఫోన్లలో అత్యంత సన్నని పోకో స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ డిస్‌ప్లే చుట్టూ స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి. పోకో ఫోన్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కన్నా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రైమరీ 108ఎంపీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఫ్లాట్ సైడ్‌లు పెద్ద పరిమాణంలో ఉన్నప్పటికీ పట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్‌తో తయారైంది.

కనెక్టివిటీ విషయానికొస్తే.. :
ఈ స్మార్ట్‌ఫోన్ దిగువన యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, పైభాగంలో ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, 5జీ డ్యూయల్ సిమ్ సపోర్ట్, జీపీఎస్, బ్లూటూత్ 5.3 ఉన్నాయి. వాల్యూమ్, పవర్ బటన్లు ఫోన్ కుడి వైపున ఉంటాయి. పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌గా కూడా పనిచేస్తుంది. పోకో నియో ఫోన్ సింగిల్ స్పీకర్‌ కలిగి ఉండగా.. టాప్‌లో 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ ఉంది.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?