IPL 2024 : జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఈ ప్లాన్‌లతో ఉచితంగా ట్రిపుల్ డేటా స్పీడ్.. ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు!

IPL 2024 : మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు జియో యూజర్లకు అదనపు డేటా అవసరం.. ఎయిర్ ఫైబర్ ప్లస్ ద్వారా ట్రిపుల్ డేటా స్పీడ్ ఎంజాయ్ చేయొచ్చు.

IPL 2024 : జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఈ ప్లాన్‌లతో ఉచితంగా ట్రిపుల్ డేటా స్పీడ్.. ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు!

IPL 2024 _ Jio AirFiber Plus Dhan Dhana Dhan Offer_ Get 3X Speed for Free With These Plans

IPL 2024 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో అందించే సర్వీసుల్లో జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ఒకటి. ఈ సర్వీసు వినియోగదారుల కోసం జియో కొత్త ధన్ ధన్ ధన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎంపిక చేసిన ప్లాన్‌లపై 2 నెలల పాటు ఉచితంగా (3ఎక్స్) ట్రిపుల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తోంది.

Read Also : Vodafone Idea Plan : వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ఇదిగో.. డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్ర్కిప్షన్ 3 నెలలు ఉచితం!

ఇప్పటికే ఉన్న, కొత్తగా జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఈ ప్రత్యేక ఆఫర్ ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే అందిస్తోంది. వినియోగదారులు 3X స్పీడ్‌తో ఐపీఎల్ క్రికెట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ జియో ఎయిర్‌ఫైబర్ ఆఫర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్ ఆఫర్ 2 నెలల పాటు వ్యాలిడిటీతో అందిస్తోంది. 6 నెలల లేదా 12 నెలల జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ వినియోగదారులు స్పీడ్ అప్‌గ్రేడ్‌కు సంబంధించి జియో నుంచి కన్ఫర్మేషన్ ఇమెయిల్, ఎస్ఎంఎస్ పొందుతారు. అయితే, కొత్త వినియోగదారుల కోసం ప్లాన్‌లు ఆటోమేటిక్‌గా ట్రిపుల్ స్పీడ్‌కి అప్‌గ్రేడ్ అవుతాయి.

ఏయే ప్లాన్లపై ఎంత డేటా పొందొచ్చు? :
30Mbps ప్లాన్ 2 నెలల పాటు 100Mbps ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ ప్లాన్ కోసం నెలకు ధర రూ. 599 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 100Mbps ప్లాన్ కోసం నెలకు రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. నెలకు రూ. 1199 ప్లాన్ కింద 100Mbps డేటా ఇప్పుడు 300Mbps ప్లాన్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాన్ నెలకు ధర రూ. 1499కు పొందవచ్చు. మరోవైపు, జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ 300Mbps ప్లాన్ ధర రూ. 1499తో 500Mbps మెరుగైన స్పీడ్ అందిస్తుంది.

జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ సొల్యూషన్‌తో జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ సాధ్యమయ్యే భవనాలకు ఈ లేటెస్ట్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు జియో ఎయిర్‌ఫైబర్ వెబ్‌సైట్ నుంచి కొత్త కనెక్షన్‌ని బుక్ చేసుకోవచ్చు. అదనంగా, టెలికాం దిగ్గజం ఇటీవలే కొత్త ఎయిర్‌ఫైబర్ యాడ్-ఆన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

ఈ ప్లాన్ల ధర వరుసగా రూ. 101, రూ. 251గా ఉన్నాయి. బేస్ ప్లాన్ ముగిసినప్పటికీ వినియోగదారులు ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. రూ. 101 యాడ్-ఆన్ ప్లాన్‌లో 100GB డేటా పొందవచ్చు. బేస్ ప్లాన్‌కు సమానమైన స్పీడ్‌తో వస్తుంది. మరోవైపు, రూ.251 ప్లాన్ 500GB డేటాతో వస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు బేస్ ప్లాన్‌కు సమానమైన వ్యాలిడిటీని అందిస్తాయి.

Read Also : iPhone 17 Launch : అద్భుతమైన డిస్‌ప్లేతో ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ వచ్చేస్తోంది.. అచ్చం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మాదిరిగానే..!