Vodafone Idea Plan : వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ఇదిగో.. డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్ర్కిప్షన్ 3 నెలలు ఉచితం!

Vodafone Idea Plan : వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రవేశపెట్టింది. రూ. 169 ప్లాన్ ద్వారా వినియోగదారులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్ర్కిప్షన్ 3 నెలల పాటు ఉచితంగా ఎంజాయ్ చేయొచ్చు.

Vodafone Idea Plan : వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ఇదిగో.. డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్ర్కిప్షన్ 3 నెలలు ఉచితం!

Vodafone Idea launches Rs 169 plan with free Disney Plus Hotstar subscription

Vodafone Idea Plan : ప్రముఖ భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన వోడాఫోన్ ఐడియా (Vi) తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి ఓటీటీ ఆధారిత కంటెంట్ వీక్షించే కస్టమర్ల కోసం రూ. 169 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌ బేస్ పెంచుకోవడమే కాకుండా సరసమైన ఆప్షన్లతో విలువైన కంటెంట్ అందించనుంది.

Read Also : Zomato Pure Veg Mode : వెజిటేరియన్ల కోసం జొమాటో కొత్త ‘ప్యూర్ వెజ్’ సర్వీసులు.. ఫస్ట్ డెలివరీ అందించిన కంపెనీ సీఈఓ

రూ. 169 ప్లాన్ వివరాలు :
వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 169 ధరతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. మొబైల్ యూజర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ ఎక్స్ టెండెడ్ వ్యాలిడిటీతో వస్తుంది. అంటే.. సాధారణ 28 రోజుల వ్యాలిడిటీకి బదులుగా పూర్తి 30 రోజుల సర్వీసులను అందిస్తుంది.

మొత్తం 8జీబీ డేటా :
ఈ కొత్త ప్లాన్‌లో వినియోగదారులకు మొత్తం 8జీబీ డేటా ఉంటుంది. రోజువారీ పరిమితి లేకుండా ఈ ప్లాన్‌ని 30 రోజుల వ్యాలిడిటీతో డేటాను ఎంజాయ్ చేయొచ్చు.

ఓటీటీ, డేటా బెనిఫిట్స్ :
డేటా ప్రయోజనాలతో పాటు కంపెనీ ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లకు ప్రీమియం ఓటీటీ కంటెంట్‌కు యాక్సెస్‌ని అందిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి 90 రోజుల పాటు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.ఈ ప్లాన్‌ను కస్టమర్‌లు సులభంగా ఎంచుకోవచ్చు.

ఇతర బెనిఫిట్స్ :
రూ.169 ప్లాన్ ముఖ్యమైన డేటాతో పాటు ఎంటర్‌టైన్మెంట్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో కాలింగ్ ఫీచర్ లేదా ఫ్రీ ఎస్ఎంఎస్ ఉండదని గమనించాలి. ఈ ప్లాన్‌కు కాల్ బెనిఫిట్స్ పొందాలంటే.. ఆసక్తిగల వినియోగదారులు వోడాఫోన్ ఐడియా రూ. 155 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. 24 రోజుల వ్యాలిడిటీతో పాటు కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Lok Sabha Elections 2024 : గూగుల్ తర్వాత ఫేస్‌బుక్.. లోక్‌సభ ఎన్నికల్లో ఏఐ ఆధారిత ఫేక్ కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు మెటా చర్యలు!