దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. రూ.70వేల మార్క్ దిశగా గోల్డ్ పరుగులు

బంగారం ధర పెరగడంతో కొనుగోలుదారులు తాజా ధరలనుచూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇదే జోష్‌ కొనసాగితే అతి త్వరలోనే గోల్డ్‌ రేట్‌ 70వేలను క్రాస్‌ చేయడం ఖాయమని బులియన్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడుతున్నారు.

దడపుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. రూ.70వేల మార్క్ దిశగా గోల్డ్ పరుగులు

Gold Rate Increase

Gold Rate Increase In Hyderabad : బంగారం తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఆకాశమే హద్దుగా పెరుగుతోన్న గోల్డ్‌ రేట్స్‌ ఈ నెలలో ఐదోసారి రికార్డులను తిరగరాస్తూ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరాయి. వడ్డీ రేట్లను తగ్గించే విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించడంతో గోల్డ్‌కు అనూహ్య ర్యాలీ వచ్చింది. గోల్డ్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మూడ్‌ బుల్లిష్‌గా ఉండటంతో దేశీయ మార్కెట్లోనూ ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వడ్డీరేట్లను మూడో వంతు తగ్గించే అవకాశముందని యూఎస్‌ ఫెడ్‌ చీఫ్‌ ప్రకటించడంతో గోల్డ్‌పై ఇన్వెస్టర్లు అధిక ఉత్సాహం చూపుతున్నారు.

Gold

గోల్డ్ ధరలకు రెక్కలు..
గోల్డ్‌ ధరలకు రెక్కలు రావడంతో యూఎస్‌ డాలర్‌ విలువ వారం రోజుల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌.. యూఎస్‌ టెన్‌ ఇయర్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ కూడా ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. ఇక ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ రేట్‌ రికార్డు స్థాయిలో 2,200 మార్కును క్రాస్‌ చేసింది. ఔన్స్‌ గోల్డ్‌ ఇంట్రాడేలో ఏకంగా దాదాపు 65 డాలర్లు పెరిగి 2,225 డాలర్లకు చేరింది. వీటితో పాటు మిగిలిన కమోడిటీ ఇండెక్స్‌లు సిల్వర్‌, కాపర్‌, ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. గ్లోబల్‌ ఎఫెక్ట్‌ దేశీయ బులియన్‌ మార్కెట్‌పై కూడా పడింది. దీంతో గురువారం ఒక్కరోజే 10గ్రాముల బంగారం ధర 11వందల రూపాయలు పెరిగింది. ఈ ఏడాది ఒక్కరోజులో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే ప్రథమం. మార్చి మొదటి వారంలో దేశీయ మార్కెట్లో జోరుమీదున్న గోల్డ్‌ రేట్స్‌.. గతవారం కాస్త శాంతించాయి. అయితే గురువారం ఊహించని స్థాయిలో పుత్తడి ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 24క్యారెట్ల గోల్డ్‌ 10గ్రాములు 67వేలా 470 రూపాయలు.. 22 క్యారెట్ల గోల్డ్‌ 10 గ్రాములు 61వేల 800 రూపాయలకు చేరింది. ఇదే వెండి ధరకూడా ఇవాళ భారీగా పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి ధర దాదాపు రూ.3,500 పైగా పెరిగి గురువారం 81,500 రూపాయలకు ఎగబాకింది.

 

Gold Price Today

రూ.70వేల మార్క్ దిశగా ..
బంగారం ధర పెరగడంతో కొనుగోలుదారులు తాజా ధరలనుచూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇదే జోష్‌ కొనసాగితే అతి త్వరలోనే గోల్డ్‌ రేట్‌ 70వేలను క్రాస్‌ చేయడం ఖాయమని బులియన్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 దేశాల్లో ఎన్నికలు జరగనుండటంతో.. ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు సేఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వైపు మొగ్గుచూపే అవకాశముంది. ఇదే జరిగితే గోల్డ్‌కు మరింత బూస్టింగ్‌ వచ్చే అవకాశముంది.

Gold

మరోవైపు ఈనెలలో పైపైకి ఎగబాకుతూ కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తున్న గోల్డ్‌ రేట్‌ రాబోయే రోజుల్లో అందనంత ఎత్తుకు చేరుకుంటాయనే అంచనాలు పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ త్వరలో ముగియనుండటం.. మరో రెండు నెలల పాటు శుభముహూర్తాలు లేకపోవడంతో గోల్డ్‌ సేల్స్‌ మందగించవచ్చనే టాక్‌ కూడా బులియన్‌ వ్యాపారుల నుంచి వినిపిస్తుంది.