MS Dhoni : మ‌నం మ్యాచ్ ఓడిపోయాం.. ఎవ‌ర‌న్నా గుర్తు చేయండ‌బ్బా..! ధోని భార్య‌ సాక్షి పోస్ట్ వైర‌ల్‌

మ్యాచ్‌లో చెన్నై ఓడిన‌ప్ప‌టికీ సీఎస్‌కే అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.

MS Dhoni : మ‌నం మ్యాచ్ ఓడిపోయాం.. ఎవ‌ర‌న్నా గుర్తు చేయండ‌బ్బా..! ధోని భార్య‌ సాక్షి పోస్ట్ వైర‌ల్‌

MS Dhonis Wife Sakshi Breaks The Internet With Her Post On CSKs Defeat

MS Dhonis Wife Sakshi : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఢిపెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓట‌మి రుచి చూపించింది. ఈ సీజ‌న్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో గెలిచి పుల్ జోష్‌లో ఉన్న రుతురాజ్ సేన‌కు ఢిల్లీ షాకిచ్చింది. విశాఖ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై 20 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. డేవిడ్ వార్నర్ (52; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), రిషబ్ పంత్‌ (51; 32 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్స‌ర్లు), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స‌ర్లు) చెల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఢిల్లీ ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 191 ప‌రుగులు చేసింది.

అనంత‌రం ల‌క్ష్య‌ఛేద‌న‌లో చెన్నై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 171 ప‌రుగుల‌కే పరిమిత‌మైంది. అజింక్య రహానె (45; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ధోనీ (37; 16 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్స‌ర్లు) ధాటిగా ఆడగా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ల‌క్ష్యానికి కాస్త దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముకేశ్‌కుమార్ మూడు వికెట్లు, ఖ‌లీల్ అహ్మ‌ద్ రెండు వికెట్ల‌తో రాణించారు.

Rishabh Pant : వారెవ్వా పంత్.. ఇలాంటి సిక్స్ చూసి ఎన్నాళ్ల‌య్యిందో.. వీడియో వైర‌ల్‌

ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిన‌ప్ప‌టికీ సీఎస్‌కే అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ధోనీ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. చాన్నాళ్ల త‌రువాత వింటేజ్ ధోనిని చూడ‌డంతో పుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ధోని భార్య సాక్షి సైతం సంతోషంగా ఉంది. మ్యాచ్ అనంత‌రం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్టోరీ వైర‌ల్‌గా మారింది. రోడ్డు ప్ర‌మాదం త‌రువాత ఈ మ్యాచ్‌లో పంత్ రాణించడాన్ని ఆమె స్వాగ‌తించారు.

సుడిగాలి ఇన్నింగ్స్ ఆడ‌డంతో ధోని ‘ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ధోని ఈ అవార్డును అందుకుంటున్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. సాక్షి ఇలా రాసుకొచ్చింది. ముందుగా పంత్‌కు స్వాగ‌తం. ఇక మ్యాచ్ ఓడిపోయామ‌ని ధోనికి ఇంకా తెలిసిన‌ట్లుగా లేదు అంటూ ఫ‌న్నీగా రాసుకొచ్చింది. ఓట‌మి బాధ లేకుండా సంతోషంగా అవార్డును ధోని అవార్డును అందుకోవ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ సాక్షి ఇలా స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించింది.