Gold Rate : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Rate : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold Rate

Gold Rate in Hyderabad : బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 850 పెరగ్గా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 930 పెరిగింది. మరోవైపు కిలో వెండిపై రూ. 600 పెరిగింది. ఈ ఏడాది బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతుండమే దీనికి కారణం. దీంతో గోల్డ్ ధరలు పెరుగుతుండటంతో బంగారం ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,600 మార్క్ కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,380 వద్దకు చేరింది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 69,530.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 63,600 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 69,380.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.64,550 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.70,420.

Gold

  • పెరిగిన వెండి ధర ..
    దేశం వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.81,600 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 81,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.78,600 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.77,500 వద్ద కొనసాగుతుంది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.