Sanju Samson : సంజూ శాంస‌న్ గేమ్ ఛేంజ‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ముంబై ఓట‌మి మొద‌లైంది అక్క‌డే..

సోమ‌వారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది

Sanju Samson : సంజూ శాంస‌న్ గేమ్ ఛేంజ‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ముంబై ఓట‌మి మొద‌లైంది అక్క‌డే..

Sanju Samson Game Changer Comment

ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో మూడు మ్యాచులు ఆడిన‌ప్ప‌టికీ ముంబై ఇండియ‌న్స్ ఇంకా బోణీ కొట్ట‌లేదు. సోమ‌వారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 125 ప‌రుగులు చేసింది. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 15.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అద్భుత ఫామ్‌ను కొన‌సాగిస్తూ రియాన్ ప‌రాగ్ (54నాటౌట్‌) అజేయ అర్థ‌శ‌త‌కంతో రాజ‌స్థాన్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఈ విజ‌యంతో రాజ‌స్థాన్ పాయింట్ల ప‌ట్టికలో అగ్ర‌స్థానానికి చేరుకుంది. ఇక మ్యాచ్ అనంత‌రం గెలుపుపై రాజ‌స్థాన్ కెప్టెన్ సంజూ శాంస‌న్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో టాస్ కీల‌క పాత్ర పోషించింద‌ని అన్నాడు. ఈ పిచ్‌పై మొద‌ట బ్యాటింగ్ చేయ‌డం అంత సులువు కాద‌న్నాడు. ట్రెంట్ బౌల్ట్‌, నంద్రే బ‌ర్గ‌ర్‌లు త‌మ అనుభ‌వాన్ని ఉప‌యోగించి వికెట్లు తీసి ప్ర‌త్య‌ర్థిని ఒత్తిడిలోకి నెట్టార‌న్నాడు.

IPL 2024 : ఈ సీజ‌న్‌లో అత్యంత వేగ‌వంత‌మైన బంతిని సంధించిన ముంబై పేస‌ర్‌.. స్పీడు ఎంతంటే?

ట్రెంట్ బౌల్ట్ గ‌త 10-15 సంవ‌త్స‌రాలుగా ఆడుతున్నాడు. కొత్త బంతితో అత‌డి నుంచి తాము ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌నే ఆశిస్తామ‌ని చెప్పాడు. అయితే.. ఆరంభంలోనే నాలుగైదు వికెట్లు ప‌డ‌తాయ‌ని తాము ఊహించ‌లేద‌న్నాడు. బౌల‌ర్లు చాలా గొప్ప‌గా రాణించార‌ని తెలిపాడు. త‌మ జ‌ట్టులో స్టార్ ప్లేయ‌ర్లు ఉన్నార‌ని, వారికి త‌మ త‌మ బాధ్య‌త‌లు ఏమిటో చాలా స్ప‌ష్టంగా తెలుసున‌న్నాడు.

అద్భుత‌మైన ప‌వ‌ర్ ప్లే ద‌క్కింద‌ని అశ్విన్‌, చాహ‌ల్ భావించారు. అంద‌క‌నే వారు వికెట్లు తీయ‌డం పై కాకుండా ప‌రుగులు నియంత్రించ‌డంపై దృష్టి సారించి బ్యాట‌ర్ల‌పై ఒత్తిడి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నించార‌న్నాడు. ఈ సీజ‌న్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు చాహ‌ల్ ఎంతో క‌సిగా ఉన్నాడ‌ని, గ‌త రెండు మూడు సీజ‌న్లుగా అత‌డు మా జ‌ట్టు త‌రుపున చాలా గొప్ప‌గా రాణిస్తున్నాడు అని శాంస‌న్ అన్నాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ ఇలాంటి రికార్డు నీకు అవ‌స‌ర‌మా?