Ajay devgn : ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌ని లైన్‌లో పెట్టిన అజయ్ దేవగన్.. వీటిలో మూడు మన సౌత్ సినిమాలే..

ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌ని లైన్‌లో పెట్టిన అజయ్ దేవగన్. అయితే వీటిలో మూడు సీక్వెల్స్ మన సౌత్ సినిమాల ఆధారంగా రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటంటే..!

Ajay devgn : ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌ని లైన్‌లో పెట్టిన అజయ్ దేవగన్.. వీటిలో మూడు మన సౌత్ సినిమాలే..

Bollywood hero Ajay devgn line up a eight sequels details

Ajay devgn : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ ఏడాది ‘షైతాన్‌’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఇక ఆ సక్సెస్ ని కొనసాగించడం కోసం ‘మైదాన్‌’ సినిమాని తీసుకు రాబోతున్నారు. ఈ మూవీ ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్ రహీం బయోపిక్‌గా తెరకెక్కింది. దాదాపు ఐదేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 10న రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ సినిమా తరువాత అజయ్ దేవగన్ ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌ని లైన్‌లో పెట్టారు. ఇక వీటిలో మూడు సినిమాలు మన సౌత్ మూవీస్ నుంచి రీమేక్ అయ్యి అక్కడ బ్లాక్ బస్టర్ సాదించినవి. ఇప్పటి బాలీవుడ్ ఆడియన్స్ కి అజయ్ దేవగన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘సింగం’. తమిళం సూపర్ హిట్టుగా నిలిచిన సూర్య ‘సింగం’కి ఇది రీమేక్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

దీంతో ఆ సినిమాని కొనసాగిస్తూ తమ సొంత కథతో సింగం 2 తీసుకు వచ్చారు. ఇప్పుడు సింగం 3ని కూడా రెడీ చేస్తున్నారు. ఆగష్టులో ఈ సింగం 3 రిలీజ్ కాబోతుంది. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాకి రీమేక్ తెరకెక్కిన అజయ్ దేవగన్ మూవీ ‘సన్ ఆఫ్ సర్దార్’. ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో.. ఎప్పటి నుంచో సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కథ చర్చలు జరుగుతున్నాయి.

Also read : Uday Kiran : ఇంద్ర సినిమాలో నటించిన నటి.. ఉదయ్ కిరణ్ మూవీలో హీరోయిన్‌గా చేయాల్సింది.. కానీ..

ఇక రీమేక్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ సాధించిన మలయాళ మూవీ ‘దృశ్యం’. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రెండు పార్టులతో హిట్స్ అందుకున్న అజయ్ దేవగన్.. ఇప్పుడు మూడో పార్ట్ వస్తే రీమేక్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఇలా సౌత్ కి సంబంధించిన మూడు సినిమాల సీక్వెల్స్ తో పాటు మరో ఐదు బాలీవుడ్ సినిమాల సీక్వెల్స్ ని కూడా సిద్ధం చేస్తున్నారు.

వీటిలో మొదటిది రైడ్‌ 2. ఇటీవలే ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేసారు. కాగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్ తో రవితేజ ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు. అలాగే ఢమాల్‌ 4, గోల్‌మాల్‌ 5, దే దే ప్యార్‌ దే 2 సినిమాలతో పాటు రీసెంట్ గా హిట్ అయిన షైతాన్ కి కూడా సీక్వెల్ ని తీసుకు రాబోతున్నారు. మరి ఈ సీక్వెల్స్ తో అజయ్ ఎలాంటి విజయాల్ని అందుకుంటారో చూడాలి.