Meera Jasmine : హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట విషాదం..
ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో సందడి చేస్తున్న హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట విషాదం చోటు చేసుకొంది.
![Meera Jasmine : హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట విషాదం.. Meera Jasmine : హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట విషాదం..](https://10tv.in/wp-content/uploads/2024/04/Senior-heroine-Meera-Jasmine-father-passed-away.jpg)
Senior heroine Meera Jasmine father passed away
Meera Jasmine : ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు. రీ ఎంట్రీలో కూడా అదిరే అందాలతో అందర్నీ ఫిదా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరోయిన్ ఇంట విషాదం చోటు చేసుకొంది. 83 ఏళ్ళ వయసు గల మీరా తండ్రి జోసెఫ్ ఫిలిప్.. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ నేడు ఏప్రిల్ 4న మరణించారు.
కేరళ ఎర్నాకులంలోని తన ఇంట్లో మీరా తండ్రి ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆదివారం నాడు ఆయనకు అంత్యక్రియల నిర్వహించనున్నారు. మీరాతో పాటు ఆయనకు మరో నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు, వారి కోసమే ఆదివారం వరకు అంత్యక్రియలను నిలుపుతున్నట్లు తెలుస్తుంది.
Also read : Rashmika Mandanna : విజయ్ దేవరకొండకి రష్మిక పెట్టుకున్న.. ముద్దు పేరు ఏంటో తెలుసా..?
View this post on Instagram
ఇక మీరా జాస్మిన్ సినిమాల విషయానికి వస్తే.. 2018 నుంచి 2022 వరకు ఇన్ యాక్టీవ్ గా ఉన్న ఈ హీరోయిన్ ఆ తరువాత రీ ఎంట్రీతో మళ్ళీ సందడి చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మళ్ళీ ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. తెలుగులో విమానం అనే సినిమాలో జస్ట్ కొన్ని నిముషాలు మాత్రమే కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇతర ప్రాజెక్ట్స్ గురించి తెలియాల్సి ఉంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు టీవీ షోలతో కూడా ఆడియన్స్ ని పలకరిస్తూ వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే అందాల ఆరబోస్తున్న ఫొటోలతో ఆకట్టుకుంటున్నారు.