CUET UG 2024 : సీయూఈటీ యూజీ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్.. మీ దరఖాస్తులో తప్పులుంటే ఇలా సరిదిద్దుకోండి!

CUET UG 2024 : మీ దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా మార్పులు చేసే ముందు అభ్యర్థులు తమ సర్టిఫికెట్‌లు, గ్రేడ్ రిపోర్టులలోని డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

CUET UG 2024 : సీయూఈటీ యూజీ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్.. మీ దరఖాస్తులో తప్పులుంటే ఇలా సరిదిద్దుకోండి!

CUET UG 2024 Application Correction Window Opens Today

CUET UG 2024 : కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) కోసం దరఖాస్తు ఫారమ్ ఎడిట్ ఆప్షన్ విండో ఓపెన్ అయింది. ఈ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను సవరించవచ్చు.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

విద్యార్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి ఏప్రిల్ 7 వరకు తమ దరఖాస్తు ఫారమ్‌లలో మార్పులు చేసుకోవచ్చు. ఈ ఎడిట్ ఆప్షన్ క్లోజ్ చేసిన తర్వాత దిద్దుబాట్లకు అవకాశాలు ఉండవని గమనించాలి. అందుకే ఈ అప్లికేషన్ సమర్పించే ముందు ఫారమ్‌ను ధృవీకరించడం కీలకం. మీ దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా మార్పులు చేసే ముందు అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, గ్రేడ్ రిపోర్టులలోని సమాచారం కచ్చితత్వాన్ని తప్పక నిర్ధారించుకోవాలి.

సీయూఈటీ యూజీ 2024 దరఖాస్తులో మార్పులు చేయండిలా :

  • అధికారిక వెబ్‌సైట్ (cuet.samarth.ac.in) విజిట్ చేయండి.
  • ‘Sign in’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ ఐడీ, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  • ‘Login’ బటన్ క్లిక్ చేయండి.
  • సీయూఈటీ ఎడిట్ విండో 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌తో కూడిన కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • సమర్పణకు ముందు ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దండి.
  • మార్పులను సేవ్ చేసి, సవరించిన ఫారమ్‌ను ప్రింట్ తీసుకోండి.
  • అప్‌డేట్ చేసిన దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోండి.

ఈ సీయూఈటీ ఎగ్జామ్ హైబ్రిడ్ విధానంలో మే 15 నుంచి 31 వరకు రోజుకు 2 లేదా 3 షిఫ్టులలో జరుగనుంది. జూన్ 30న ఫలితాలను ప్రకటించనున్నారు. 2022లో ప్రవేశపెట్టిన సీయూఈటీ (యూజీ) రాష్ట్ర యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్శిటీలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ యూనివర్శిటీలతో సహా ఏదైనా కేంద్రీయ యూనివర్శిటీలు లేదా ఇతర భాగస్వామ్య సంస్థలలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు అవకాశాన్ని అందిస్తుంది.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?