కిరణ్ అబ్బవరం.. ‘సెబాస్టియన్ P.C. 524’.. రిపోర్టింగ్ from మదనపల్లి పోలీస్ స్టేషన్..
“రాజావారు రాణిగారు” చిత్రంతో చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుసగా సినిమాలు కమిట్ అవుతూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పటికే కిరణ్ తన రెండో సినిమాగా “ఎస్.ఆర్.కళ్యాణమండపం Est.1975” లో నటిస్తున్నాడు.
ఈ సినిమాను నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ వారితోనే తాజాగా “సెబాస్టియన్ పి.సి. 524” అనే ప్రాజెక్ట్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో కిరణ్ అబ్బవరం, ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో మరో వినూత్నమైన సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాకి ప్రమోద్, రాజులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతన్నాడు. ఇది ఇలా ఉంటే కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు(జూలై 15న) సందర్భంగా “సెబాస్టియన్ పి.సి. 524” ఫస్ట్ లుక్‌ని స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆన్లైన్లో విడుదల చేశారు.
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం పోలీస్ కాన్సిస్టేబుల్గా నటిస్తున్నాడు. అలానే ఈ సినిమాలో హీరో రే చీకటి (నైట్ బ్లైండ్ నెస్ తో) బాధపడుతుంటాడనే వివరాన్ని కూడా ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు. సెబాస్టియన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు, త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమాకి ఎడిటింగ్: విప్లవ్ నైశాదం, సినిమాటోగ్రాఫర్: రాజ్ కే నల్లి.