బీచ్‌లో చెప్పులు లేకుండా యువకుడు వాకింగ్.. మాంసాన్ని తినే బాక్టీరియా సోకి..

Walking Barefoot On Beach: ఎప్పటిలాగే వాకింగ్ కు వెళ్లాడు. సముద్రానికి కొట్టుకువచ్చిన గవ్వలు, శంఖాలపై కాళ్లు పెట్టాడు.

బీచ్‌లో చెప్పులు లేకుండా యువకుడు వాకింగ్.. మాంసాన్ని తినే బాక్టీరియా సోకి..

Walking Barefoot On Beach

బీచ్‌లో చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్న ఓ యువకుడు తనకున్న అదే అలవాటు వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాంసాన్ని తినే బాక్టీరియా సోకి ప్రాణపాయ స్థితిలోకి చేరుకున్నాడు.

అమెరికాలోని సౌత్ కరోలినా చార్లెస్టన్ లో నివసిచే బ్రెంట్ నార్మన్‌ అనే యువకుడు ప్రతిరోజు దాదాపు 15,000 అడుగులు వాకింగ్ చేసేవాడు. సల్లివన్ ద్వీపం, ఐల్ ఆఫ్ పామ్స్ మధ్య తీరప్రాంతంలో అతడికి వాకింగ్ చేసే అలవాటు ఉంది. తాజాగా, ఎప్పటిలాగే వాకింగ్ కు వెళ్లాడు.

సముద్రానికి కొట్టుకువచ్చిన గవ్వలు, శంఖాలపై కాళ్లు పెట్టాడు. అదే సమయంలో అతడి కాళ్లకు బ్యాక్టీరియా సోకింది. దీనిపై బ్రెంట్ నార్మన్‌ మాట్లాడుతూ… సముద్రంలో అలలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. తాను అనేక గవ్వలపై అడుగు పెట్టానని తెలిపాడు. నిజానికి తాను తన జీవితమంతా బీచ్‌లలోనే పెరిగానని, ఇప్పటి వరకు దాదాపు 10,000 షెల్స్‌పై అడుగు పెట్టానని చెప్పాడు.

కొన్ని రోజుల క్రితం కొన్ని గవ్వలపై కాళ్లు పెట్టినప్పటి నుంచి తన కాల్లలో నొప్పి రావడం మొదలు పెట్టిందని అన్నాడు. తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చాయని తెలిపాడు. ఆ తర్వాత తన కాళ్లలో వాపు కూడా మొదలైందని, తాను నడవలేకపోతున్నానని చెప్పాడు. అతడికి విబ్రియో బ్యాక్టీరియా వల్ల వచ్చే విబ్రియోసిస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

Also Read: ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా కోల్‌క‌తా.. షాకిచ్చిన బీసీసీఐ