HMD Pulse Arrow : భారత్‌కు హెచ్ఎండీ ‘యారో’ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. హెచ్ఎండీ పల్స్‌కు రీబ్రాండెడ్ వెర్షన్!

HMD Pulse Arrow : రాబోయే హెచ్ఎండీ ఫోన్ గత నెల నుంచి యూరప్‌లో అందుబాటులో ఉన్న హెచ్ఎండీ పల్స్‌కి రీబ్రాండ్‌గా రానుందని అంచనా. హెచ్ఎండీ పల్స్ అమెరికాలో హెచ్ఎండీ వైబ్‌గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

HMD Pulse Arrow : భారత్‌కు హెచ్ఎండీ ‘యారో’ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. హెచ్ఎండీ పల్స్‌కు రీబ్రాండెడ్ వెర్షన్!

HMD’s First Smartphone Arrow ( Image Credit : Google )

HMD Pulse Arrow : ప్రముఖ నోకియా-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ల తయారీలో ప్రసిద్ధి చెందిన సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లో మొదటి హెచ్ఎండీ-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అధికారిక లాంచ్‌కు ముందు.. ఫిన్నిష్ బ్రాండ్ డివైజ్ మోనికర్‌ను ధృవీకరించింది. ఈ బ్రాండ్ ఎక్స్ వేదికగా పోటీ ద్వారా మొబైల్ పేరును ఎంపిక చేసింది. రాబోయే హెచ్ఎండీ ఫోన్ గత నెల నుంచి యూరప్‌లో అందుబాటులో ఉన్న హెచ్ఎండీ పల్స్‌కి రీబ్రాండ్‌గా రానుందని అంచనా. హెచ్ఎండీ పల్స్ అమెరికాలో హెచ్ఎండీ వైబ్‌గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Read Also : Realme C65 Launch : భారీ డిస్‌ప్లే, 5జీ సపోర్ట్‌తో రియల్‌మి C65 ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర రూ. 10,499 మాత్రమే!

గత వారమే హెచ్ఎండీ ఇండియా భారత్‌లో మొదటి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ పేర్లను సూచించమని యూజర్లను కోరుతూ ఎక్స్ వేదికగా #HMDNameOurSmartphone పోటీని ప్రారంభించింది. ఇందుమనోయిడ్, మంభ, నరుటో, బ్రహ్మోస్ వంటి మరిన్ని పేర్లను సూచిస్తూ ప్రేక్షకుల నుంచి అనేక సూచనలను అందుకుంది. దాంతో ఈ విభిన్న మార్కెటింగ్ వ్యూహం అందరి దృష్టిని ఆకర్షించింది.

రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా వెల్లడించిన విధంగా బ్రాండ్ ఇప్పుడు యారో అనే పేరును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది టీ20 సీజన్‌లో బ్రాండ్ తమ అధికారిక స్మార్ట్‌ఫోన్ భాగస్వామిగా ఐపీఎల్ జట్టుతో జతకట్టింది.

ఈ హ్యాండ్‌సెట్ కొన్ని వారాల్లో దేశంలో లాంచ్ కానుంది. హెచ్ఎండీ యారో ఎంట్రీ-లెవల్ హ్యాండ్‌సెట్‌గా వస్తుందని భావిస్తున్నారు. హెచ్ఎండీ పల్స్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. గతంలో యూరోప్‌లో ఈయూఆర్ 140 (దాదాపు రూ. 12,460)కి రెండో ఫోన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త డివైజ్ అట్మాస్ బ్లూ, డ్రీమీ పింక్, మెటోర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విక్రయించింది.

హెచ్ఎండీ వివిధ ప్రాంతాలలో ఒకే స్మార్ట్‌ఫోన్‌కు వేర్వేరు పేర్లను ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది. హెచ్ఎండీ వైబ్ మోనికర్‌తో యూఎస్‌లో హెచ్ఎండీ పల్స్‌ మోడల్ ఆవిష్కరించాలని భావిస్తున్నారు. హెచ్ఎండీ యారో హెచ్ఎండీ పల్స్‌తో సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని అంచనా. హెచ్ఎండీ పల్స్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

6.65-అంగుళాల HD+ (720×1,612 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌తో 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ 12ఎన్ఎమ్ యూనిసోక్ టీ606 చిప్‌పై రన్ అవుతుంది. అలాగే, 13ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. హెచ్ఎండీ పల్స్ ఫోన్ 128జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. 10W ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : iPhone 16 Pro Display : ఆపిల్ ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ 16 ప్రోలో 20శాతం బ్రైట్‌నెస్ డిస్‌ప్లే.. కొత్త క్యాప్చర్ బటన్..!