Paytm FAQ Answers : పేటీఎం ఇప్పుడు పనిచేస్తుందా? యూపీఐ పేమెంట్లు చేయొచ్చా? ఏది పనిచేస్తుంది? యూజర్ల ప్రశ్నలకు సమాధానాలివే..!

Paytm FAQ Answers : పేటీఎం రీఛార్జ్, బిల్లు పేమెంట్లు, మూవీ టికెట్లు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పేటీఎం యూజర్లు తరచుగా అడిగే అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం.

Paytm FAQ Answers : పేటీఎం ఇప్పుడు పనిచేస్తుందా? యూపీఐ పేమెంట్లు చేయొచ్చా? ఏది పనిచేస్తుంది? యూజర్ల ప్రశ్నలకు సమాధానాలివే..!

Paytm FAQs answeres ( Image Credit : Google )

Paytm FAQ Answers : పేటీఎం యూజర్లకు అలర్ట్.. మీరు ఇంకా పేటీఎం వాడుతున్నారా? ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని ప్రభుత్వం నిబంధనలు, పర్యవేక్షక సమస్యల కారణాలతో భారత్‌లో బ్యాన్ చేసింది. కానీ, పేటీఎం యాప్ కూడా పనిచేయదని దీని అర్థం కాదు. కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సర్వీసులు మాత్రమే నిలిచిపోయాయి.

Read Also : Google I/O 2024 : ఈ రాత్రికే గూగుల్ I/O ఈవెంట్.. కొత్తగా ఏయే ప్రకటనలు ఉండొచ్చుంటే? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

పేటీఎంలో ఇతర సర్వీసులకు ఎలాంటి సమస్య లేదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి సంబంధించిన ఫీచర్‌లు అందుబాటులో లేవని గమనించాలి. పేటీఎంలో పేమెంట్స్ బ్యాంకు మినహా ఇతర ఫీచర్లు అన్ని పనిచేస్తూనే ఉన్నాయి. పేటీఎం రీఛార్జ్, బిల్లు పేమెంట్లు, మూవీ టికెట్లు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పేటీఎం యూజర్లు తరచుగా అడిగే అనేక ప్రశ్నలకు సమాధానాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

పేటీఎం యాప్‌లో యూపీఐ పేమెంట్లు చేయవచ్చా? :
మీరు యూపీఐ పేమెంట్లను చేయడం, యూపీఐ ద్వారా డబ్బు పంపడం లేదా స్వీకరించడం లేదా పేటీఎం యాప్‌లో యధావిధిగా ఆఫ్‌లైన్ క్యూఆర్ కోడ్ పేమెంట్లు చేయడం కొనసాగించవచ్చు. ఎందుకంటే.. మల్టీ-బ్యాంక్ మోడల్‌లో థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా యూపీఐలో పాల్గొనడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి ప్లాట్‌ఫారమ్ ఆమోదం పొందింది. పేటీఎం ప్రస్తుతం యశ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లకు సపోర్టు ఇస్తుంది.

పేటీఎంలో రీఛార్జ్‌లు, బిల్లులు చెల్లించవచ్చా? :
అవును. మీరు ఎప్పటిలాగే మీ అన్ని రీఛార్జ్‌లు, బిల్లు పేమెంట్ల కోసం పేమెంట్ యాప్‌ని ఉపయోగించవచ్చు. మీరు ఇతర విషయాలతోపాటు ప్రయాణం, మూవీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఉపయోగించవచ్చు.

మై వ్యాలెట్, ట్రాన్సిట్ కార్డ్‌ ఎలా క్లోజ్ చేయాలి? :

  • మీరు మెట్రో/బస్సు ప్రయాణంలో మీ ప్రస్తుత బ్యాలెన్స్‌ని ఉపయోగించవచ్చు.
  • మీ వ్యాలెట్ అండ్ ట్రాన్సిట్ కార్డ్‌ని కూడా క్లోజ్ చేయొచ్చు.
  • ముందుగా పేటీఎం యాప్‌ ఓపెన్ చేయండి
  • మీ ప్రొఫైల్ ఆప్షన్ నొక్కండి (లెఫ్ట్ సైడ్)
  • Help and Support ఆప్షన్ ఎంచుకోండి.
  • ‘Banking Services and Payments’ సెలక్ట్ చేయండి.
  • View More ఆప్షన్ ఎంచుకోండి.
  • View all Services ద్వారా వాలెట్ ట్రాన్సిట్ కార్డ్‌ ఆప్షన్‌కు వెళ్లండి.
  • ‘Need help with non-order related queries’ ఎంచుకోండి.
  • ఆ తర్వాత, మీరు NCMC ట్రాన్సిట్ కార్డ్ సర్వీస్‌ను క్లోజ్ చేయాలి అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషిన్ పనిచేస్తాయా? :
అవును. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో దీనికి ఎలాంటి సంబంధం లేదు. పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషిన్ పనిచేస్తూనే ఉంటాయి.

Read Also : Paytm Lite Payments : పేటీఎం లైట్‌ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్.. ఇకపై పిన్ లేకుండానే రోజుకు రూ. 4వేలు యాడ్ చేయొచ్చు..!