Rohit Sharma : అమెరికా పోలీసులు ఇలా ఉన్నారేంట్రా బాబు.. ఓ వైపు రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌ని చెబుతున్నా..!

మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ఓ ఫ్యాన్ పోలీసుల క‌ళ్లు గ‌ప్పి మైదానంలోకి వ‌చ్చాడు.

Rohit Sharma : అమెరికా పోలీసులు ఇలా ఉన్నారేంట్రా బాబు.. ఓ వైపు రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌ని చెబుతున్నా..!

Fan invades pitch to meet Rohit Sharma during IND vs BAN warm up match

Rohit Sharma fan : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఘ‌నంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో కెనడా పై అమెరికా ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఇక భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. అయితే.. అంత‌క‌ముందు శ‌నివారం భార‌త్, బంగ్లాదేశ్‌తో స‌న్నాహ‌క మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ఓ ఫ్యాన్ పోలీసుల క‌ళ్లు గ‌ప్పి మైదానంలోకి వ‌చ్చాడు.

నేరుగా హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ద‌గ్గ‌రికి వ‌చ్చి అత‌డిని కౌగిలించుకున్నాడు. అప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు మైదానంలో వ‌చ్చి సద‌రు అభిమానిని నేల‌పై ప‌డుకోబెట్టారు. అత‌డి చేతుల‌కు సంకెళ్లు వేశారు. రోహిత్ శ‌ర్మ అలా చేయొద్ద‌ని చెబుతున్నా అమెరికా పోలీసులు అత‌డి మాట‌ను వినిపించుకోలేదు. వెంట‌నే రోహిత్ మ్యాచ్ నిర్వాహ‌కుల‌కు సైగ చేయ‌డంతో ఒక‌రు వ‌చ్చి పోలీసులకు చెప్ప‌గా స‌ద‌రు అభిమానిని పైకి లేపి మైదానం బ‌య‌ట‌కు తీసుకువెళ్లారు. కాగా.. అత‌డిని అరెస్టు చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

T20 World Cup 2024 : తొలి మ్యాచ్‌లోనే ప‌రుగుల వ‌ర‌ద‌.. అమెరికా సంచ‌ల‌న విజ‌యం..

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మైదానంలో అమెరికా పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరు ప‌ట్ల చ‌ర్చ మొద‌లైంది. ఓ గ్యాంగ్ స్ట‌ర్‌ను ప‌ట్టుకున్న‌ట్లుగా అమెరికా పోలీసులు ప్ర‌వ‌ర్తించార‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో స‌ద‌రు అభిమానిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేసిన రోహిత్ శ‌ర్మ‌ను ప్ర‌శంసిస్తున్నారు.

ఇక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భార‌త్ 60 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 182 ప‌రుగులు చేసింది. రిష‌బ్ పంత్ (32 బంతుల్లో 53 రిటైర్డ్ ఔట్‌) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా, హార్దిక్ పాండ్య (23 బంతుల్లో 40 నాటౌట్‌), సూర్య‌కుమార్ యాద‌వ్ (18 బంతుల్లో 31) లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 122 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, శివమ్ దూబెలు చెరో రెండు వికెట్లు తీయ‌గా, బుమ్రా, సిరాజ్‌, హార్దిక్ పాండ్య‌, అక్ష‌ర్ ప‌టేల్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Rohit Sharma : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు..