Massive Grocery Receipt : ఈ కిరాణా సరుకుల బిల్లు చూస్తే బిత్తరపోవాల్సిందే.. వారానికి రూ. 37వేలు ఖర్చు..!

Massive Grocery Receipt : లాస్ ఏంజెల్స్ కౌంటీలోని వెస్ట్‌లేక్ విలేజ్‌లోని ట్రేడర్ జో స్టోర్ నుంచి తీసుకున్న కిరాణా సరుకుల రసీదు ఇది. ఈ వీడియోలో ఈ భారీ కిరణా సరుకుల లిస్టు మొత్తం వారంన్నర రోజుల కోసం మాత్రమేనట..

Massive Grocery Receipt : ఈ కిరాణా సరుకుల బిల్లు చూస్తే బిత్తరపోవాల్సిందే.. వారానికి రూ. 37వేలు ఖర్చు..!

California Dad's Massive Grocery Receipt ( Image Source : Google )

Massive Grocery Receipt : మీరు కిరాణా వస్తువులపై ఎంత ఖర్చు చేస్తారు? అదే మీది పెద్ద ఫ్యామిలీ అయితే.. రూ. 10వేలు లేదా ఆపైన కొంత ఖర్చు చేస్తారు.. అదే చిన్న కుటుంబం అయితే అంతకంటే తక్కువే ఉండొచ్చు. మహా అయితే వారానికి రెండు వేలకు మించి కిరాణా బిల్లు ఉండకవచ్చు.

Read Also : Moto G85 5G Launch : మోటో G85 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

కానీ, కాలిఫోర్నియాకు చెందిన ఒక తండ్రి మాత్రం తన కుటుంబం కోసం వారానికి ఏకంగా రూ. 37వేలు కేవలం కిరాణా సరుకుల కోసమే ఖర్చు చేస్తున్నాడట.. ఇటీవల ట్రేడర్ మర్చంట్ జోకు చెందిన షాపింగ్ రశీదును సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతుంది. ఈ కిరాణ సరుకుల బిల్లును చూస్తుంటే చాంతాడంతా లిస్టు కనిపిస్తోంది.

ఆ తండ్రికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. తన కుటుంబానికి వారం వారీగా అయ్యే ఆహార ఖర్చుల వివరాలను వెల్లడించాడు. 444.38 డాలర్లు అంటే.. దాదాపు మన భారత కరెన్సీలో రూ. 37వేలకి సమానం. లాస్ ఏంజెల్స్ కౌంటీలోని వెస్ట్‌లేక్ విలేజ్‌లోని ట్రేడర్  జో స్టోర్ నుంచి తీసుకున్న కిరాణా సరుకుల రసీదు ఇది. ఈ వీడియోలో ఈ భారీ కిరణా సరుకుల లిస్టు మొత్తం వారంన్నర కోసం మాత్రమేనని తండ్రి వివరించాడు.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో @PicturesFoIder ద్వారా పోస్ట్ చేయగా అప్పటి నుంచి 17 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. “సుమారు వారంన్నర పాటు ఆరుగురు పిల్లలకు ఆహారం ఇవ్వడానికి ఏమి కావాలి” అని తండ్రి వీడియోలో చెప్పాడు. “మీకు ఆరుగురు పిల్లలు కావాలనుకుంటున్నారా? మీ ట్రేడర్ జో రసీదు” ఇదిగో అంటూ పేర్కొన్నాడు.

ఆ రసీదులో స్ట్రాబెర్రీలు, అవకాడోలు, దోసకాయలు, ట్రేడర్ జో చికెన్ చీజ్, టమేల్స్, చికెన్ సూప్ డంప్లింగ్‌లు, మార్గరీటా పిజ్జా, కొరియన్ స్టైల్ బీఫ్ షార్ట్ రిబ్‌లు వంటి మరిన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది ఎక్స్ యూజర్లు మెరుగైన ధరలకు ఇతర షాపులలో షాపింగ్ చేయాలని సూచించారు. 6 మంది పిల్లలతో కాస్ట్‌కోకు బదులుగా ట్రేడర్ జోస్‌లో షాపింగ్ చేయాలన్నారు. వారందరిని వాల్‌మార్ట్‌కి తీసుకెళ్లండి లేదా మరేదైనా చేయండని మరో యూజర్ కామెంట్ చేశాడు. అదే ఆల్డిలో అయితే 1/3 ఖర్చు అవుతుందని మరో యూజర్ ట్వీట్ చేశాడు.

జో కొనుగోలు చేసిన చాలా ఆహార పదార్థాలు ఖరీదైన రెడీమేడ్ ఉత్పత్తులుగా నెటిజన్లు గమనించారు. అందుల ఒక యూజర్ “నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. పిండి, వెన్న, పాలు, ఓట్ గింజలు, తేనె, బియ్యం, రెండు కోళ్లు, కోకో పౌడర్, గుడ్లు, మీడియం చెడ్డార్, గ్రౌండ్ బీఫ్, ఆలివ్ ఆయిల్, ఎండుద్రాక్ష, కాఫీ గింజల కోసం సుమారు 100 డాలర్ల నుంచి 150 డాలర్లు (దాదాపు రూ. 12వేలకు పైగా) ఖర్చు చేస్తున్నానని కామెంట్ చేశాడు.

Read Also : Gautam Gambhir : అఫీషియ‌ల్ : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌..