యాచకులను వెనకుండి నడిపిస్తున్నదెవరు.. గడ్డుకాలం నుంచి గట్టెక్కేందుకు పాకిస్తాన్‌కు బెగ్గింగే దిక్కా.?

యాచకులను వెనకుండి నడిపిస్తున్నదెవరు.. గడ్డుకాలం నుంచి గట్టెక్కేందుకు పాకిస్తాన్‌కు బెగ్గింగే దిక్కా.?

Pakistan Beggars travel to Saudi Arabia Iran and Iraq posing as pilgrims visiting shrines

Pakistan: పాకిస్థాన్ అంటే టక్కున టెర్రరిస్టులే గుర్తుకు వస్తారు. ఇప్పుడు ఉగ్రవాదంతో పాటు అడుక్కోవడానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది పాక్. దేశంగా తాము ఇంకో దేశం నుంచి సహకారం తీసుకోవడం ఒక ఎత్తు అయితే.. ఇతర దేశాలకు గుట్టుచప్పుడు కాకుండా యాచకులను పంపి బెగ్గింగ్ చేయిస్తోంది. ఇది కాస్త ఇష్యూగా మారడంతో అలర్ట్ అయింది. గడ్డు కాలం నుంచి గట్టెక్కేందుకు బెగ్గింగ్‌ను వాడుకుంటోంది దాయాది కంట్రీ. తమ దేశం నుంచి ఇతర దేశాలకు యాచకులను పంపి.. అక్కడ సంపాదించిన సొమ్మును సొంత దేశంలో పెట్టుబడి పెట్టేలా ప్లాన్ చేస్తోంది. దేశమే కాదు.. పాక్‌ ప్రజలు కూడా బిచ్చమొత్తుకుంటుండంతో.. ఏ దేశం కూడా పాకిస్థాన్‌ పేరెత్తితేనే సహించే పరిస్థితి లేకుండా పోయింది. ఆపదలో ఉన్నారని ఆదుకుందామనుకుంటే తమనే నిండా ముంచే కుట్ర జరుగుతోందని సీరియస్ అవుతున్నాయి సౌదీ లాంటి దేశాలు.

పాక్ బిచ్చగాళ్లు సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌ వంటి గల్ఫ్ దేశాలకు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో ఆయా దేశాలకు బిచ్చగాళ్లు తలనొప్పిగా మారుతున్నారు. సౌదీ అరేబియా ఏకంగా పాకిస్థాన్‌కు ఫిర్యాదు చేసింది. హజ్ యాత్రికుల పేరుతో తమ దేశానికి భారీగా పాక్‌ నుంచి బిచ్చగాళ్లు వస్తున్నారని, వీరిని కట్టడి చేయాలని సౌదీ కోరింది.

పరిస్థితి చేయిదాటి పోతుండటంతో కంటి తుడుపు చర్యలు మొదలుపెట్టింది పాకిస్థాన్. తామే యాచకులను ఇతర దేశాలకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నట్లు పైకి చెప్పుకొస్తుంది. 2వేల మందికి పైగా యాచకుల పాస్‌పోర్టులను ఏడేళ్లపాటు బ్లాక్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. యాచకులను విదేశాలకు పంపే ఏజెంట్ల పాస్‌పోర్టులను కూడా ప్రభుత్వం బ్లాక్ చేస్తోంది. ఇతర దేశాల్లో భిక్షాటన వ్యాపారానికి చెడ్డపేరు తెస్తుండటంతో విదేశీ యాచక వ్యాపారాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం చెబుతోంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్‌లలో భిక్షాటన చేస్తున్న వాళ్లను కట్టడి చేయాలని.. లేకపోతే ఆయా దేశాలనుంచి ఒత్తిడి పెరిగిపోతుందని చెప్పుకుంటోంది పాక్ విదేశాంగశాఖ. విదేశాలలో అరెస్టయిన 90 శాతం బిచ్చగాళ్ళు పాకిస్థాన్‌కు చెందినవాళ్లేనని పాక్ సర్కార్ వేసిన ఓ కమిటీ తేల్చింది. ఎంత చెప్పినా వినకపోవడంతో పాక్ నుంచి వెళ్లిన యాచకులను.. సౌదీ, ఇరాన్, ఇరాక్ అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నాయి.

నవాజ్ షరీఫ్ ఆందోళన
అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ బిక్షమెత్తుకునే దేశంగా మారిపోయిందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేశాన్ని సంప్రదించినా.. ఏ దేశానికి పాక్ పెద్దలు కాల్ చేసినా చీప్‌గా చూసే పరిస్థితి వచ్చిందని దేశ దుస్థితిపై గోడు వెళ్లబోసుకున్నారు. ఏ స్నేహపూర్వక దేశానికి వెళ్లినా, ఫోన్ చేసినా..డబ్బు అడుక్కోవడానికి వచ్చామని అనుకునే దుస్థితి వచ్చిందని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పరిస్థితి చేయిదాటిపోయాక..
అసలు ఆర్థిక సంక్షోభానికి దారి తీసిందే పాక్ పాలకులు. ప్రజల్లో మతం పిచ్చి పెంచి.. ఉగ్రవాదాన్ని పోత్సహించి.. ప్రస్తుత పరిస్థితికి కారణమైందే పాక్‌ను పాలిస్తున్న నేతలు. స్వార్థం కోసం అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు చేస్తున్న కుట్రలతో ప్రజల జీవితాలు ఆగం అవుతూ వస్తున్నాయి. పాక్ దేశాన్నే కాదు.. పాకిస్థాన్ ప్రజలను ఇతర దేశాలు చులకనగా చూస్తున్నాయి. పరిస్థితి చేయిదాటిపోయాక.. ఇప్పుడు సాయం కోసం వెతిక్కుంటే వచ్చే లాభం ఏం ఉందన్న చర్చ ఉంది. ప్రజలకు విద్యా, ఉపాధి అవకాశాల కోసం కాకుండా అంతర్గత సమస్యలను పట్టించుకోకుండా.. ఇటు భారత్‌ను అటు అప్ఘనిస్తాన్‌ను గెలుక్కుంటూ పోతే పాక్‌కు సాయం చేసే నాధుడే లేకుండా పోయాడు. పైగా ఇప్పటివరకు టెర్రరిస్ట్ కంట్రీగా పేరున్న పరిస్థితి నుంచి బెగ్గింగ్ దేశంగా చూసే పరిస్థితి వచ్చింది.

Also Read : బాబోయ్ ఏంటి ఈ చిట్టా.. పిల్లల కోసం తండ్రి షాపింగ్.. వారానికే రూ.37 వేల కిరాణా బిల్లు!

పాలకుల తీరే కారణం..
ప్రజలు బెగ్గింగ్ వైపు వెళ్లడానికి కూడా పాక్ పాలకుల తీరే కారణం. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చకుండా.. అడ్డగోలు నిర్ణయాలతో..టెర్రరిజాన్ని పోత్సహిస్తూ..వారి దేశాన్ని వాళ్లే ఆగం చేసుకున్నారు. ఇప్పుడు ఇతర దేశాల దగ్గరకు వెళ్లి చేయిచాచినా రూపాయి ఇచ్చేవాడు లేడు. ప్రజలను యాచకులుగా పంపి అడుక్కుందామనుకున్నా అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది.

Also Read : బెగ్గర్స్‌పై బ్యాన్ పేరుతో పాకిస్తాన్ కొత్త రాగం.. వర్కవుట్ అవుతుందా?

ఆర్థిక సంక్షోభంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి.. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు కాస్త ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా.. పది రూపాయల వస్తువు 15 రూపాయలుగా.. 50 రూపాయల వస్తువుగా వందగా ఉంది. ఇది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎటుచూసినా ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు, నేతలు బానే ఉంటున్నారు. ప్రజలే ఆగమవుతున్నారు. దేశం నాశనమవుతోంది. ఇది పాకిస్తాన్‌లో పరిస్థితి.