పాకిస్తాన్‌లో జోరుగా భిక్షాటన వ్యాపారం.. ఇరాన్, సౌదీలకు తలనొప్పిగా మారిన పాక్

దేశమే కాదు.. దేశ ప్రజలు అడుక్కోవడంపై పాక్ ప్రభుత్వంలోనే ఆందోళన మొదలైంది. పాక్ ప్రభుత్వం చేతిలో గిన్నె పట్టుకుని భిక్షాటన చేసుకుంటుంటే, దేశంలో భిక్షాటన అనేది ఒక పరిశ్రమగా మారింది.

పాకిస్తాన్‌లో జోరుగా భిక్షాటన వ్యాపారం.. ఇరాన్, సౌదీలకు తలనొప్పిగా మారిన పాక్

Why Pakistan revokes passports of 2000 beggars for 7 years explained here

భిక్షాటన. పాకిస్తాన్‌లో ఇదో వ్యాపారం అయిపోయింది. ఆర్థిక సంక్షోభంతో నిండా మునిగిన పాకిస్తాన్ ఇప్పటికే ఇతర దేశాల సాయం కోసం ప్రాధేయపడుతోంది. సరే పరిస్థితులు కలసిరాక దేశమే ఆ పరిస్థితుల్లో ఉందంటే.. పాక్ ప్రజలు కూడా భిక్షాటనే తమ వృత్తిగా మల్చుకుంటున్నారు. దేశమే కాదు.. దేశ ప్రజలు అడుక్కోవడంపై పాక్ ప్రభుత్వంలోనే ఆందోళన మొదలైంది. పాక్ ప్రభుత్వం చేతిలో గిన్నె పట్టుకుని భిక్షాటన చేసుకుంటుంటే, దేశంలో భిక్షాటన అనేది ఒక పరిశ్రమగా మారింది. పెద్ద నగరాలే కాదు.. చిన్న పట్టణాల్లోనూ భిక్షాటన వ్యాపారమైంది. సరే వారి దేశానికి పరిమితమైన పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. అంతటితో ఆగకుండా ఇతర దేశాలకు యాచకులను ఎగుమతి చేస్తుంది పాకిస్తాన్.

ఫుల్ ఆర్గనైజ్‌డ్‌గా బెగ్గింగ్
మతపరమైన పర్యటనల పేరుతో సౌదీ అరేబియా వంటి దేశాలకు వెళ్తున్న పాకిస్తానీల్లో ఎక్కువమంది అక్కడ భిక్షాటన చేసుకుంటున్నారు. బిచ్చమెత్తుకునే ఉద్దేశంతోనే విజిటింగ్ వీసాలపై బిచ్చగాళ్లు సౌదీ అరేబియా దేశాలకు వెళ్తున్నారని పాక్ విదేశీ వ్యవహారాల శాఖే ఒప్పుకుంటోంది. ఇతర దేశాల నుంచి వస్తోన్న ఫిర్యాదులతో ఈ నిజాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చేసింది. సౌదీ, ఇరాన్, ఇరాక్‌లో పాకిస్తానీలు వేలాదిమంది ఉన్నారు. వాళ్లలో చాలామంది ఉపాధి కోసం ఏదో ఒక పనిచేసుకోకుండా.. బిచ్చమే బిజినెస్‌గా రెచ్చిపోతున్నారు. ఫుల్ ఆర్గనైజ్‌డ్‌గా ఈ బెగ్గింగ్ నడుస్తున్నట్లు పాక్ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.

 3 కోట్ల మంది యాచకులు! 
24 కోట్లకు పైగా జనాభా ఉన్న పాకిస్తాన్‌లో 3 కోట్ల మంది బిచ్చుమెత్తుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పాక్ విదేశాంగ లెక్కల ప్రకారమే 3 కోట్ల మంది యాచకులు ఉంటే.. బెగ్గింగ్ అనేది పాకిస్తాన్‌లో ఏ రేంజ్‌లో నడుస్తుందో అర్తం చేసుకోవచ్చు. అంతే కాదు కరాచీ లాంటి పెద్దనగరాల్లో అయితే బిచ్చగాళ్ల సంఖ్య చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మమూలుగానే కరాచీలో లక్షా 30వేల మంది యాచకులు ఉంటారని చెప్తున్నారు అక్కడి అధికారులు. రంజాన్ సీజన్‌లో అయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కరాచీకి 3 లక్షల మంది వచ్చి అడుక్కుంటారని చెప్తున్నారు.

ఏడాదికి 42 బిలియన్ డాలర్లు
విదేశాలకు వెళ్లి అడుక్కునేవారు కోట్లల్లో ఉంటారని అంచనా. ఒక ఆర్గనైజ్‌డ్ బెగ్గింగ్ ద్వారా వందల కోట్లు సంపాదించి.. తిరిగి తమ దేశంలో పెట్టుబడులు పెడుతున్నారన్న ప్రచారం ఉంది. దీంతో సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించే ప్రయత్నం జరుగుతోంది. దేశమే కాదు.. పాక్ ప్రజలు కూడా బిచ్చమెత్తుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగాలు లేక, ద్రవ్యోల్బణం పెరిగిపోయి పేదలను భిక్షాటనలోకి నెట్టాయి. ఇది క్రమంగా ఓ వ్యాపారంగా, పరిశ్రమగా మారిపోయింది. ఇదే అదునుగా కొందరు దీన్ని ఆర్గనైజ్ చేసి కోట్లు సంపాదించి సొంత దేశంలో పెట్టుబడులు పెట్టేస్థాయికి ఎదిగారు. కరాచీలో ఓ బిచ్చగాడు రోజుకు కనీసం 2 వేలు, లాహోర్‌లో 14 వందలు, ఇస్లామాబాద్‌లో 950 సంపాదిస్తున్నట్లు పాక్ అధికారులే అంచనా వేస్తున్నారు. బిచ్చగాళ్ళు సంవత్సరానికి 42 బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు. ఇది పాకిస్తాన్ GDPలో 12శాతం కంటే ఎక్కువ.

బిచ్చమే దిక్కు..
ఏమీ దిక్కులేని స్థితిలో బిచ్చమే దిక్కు అయింది. అదే దేశాన్ని నిలబెడుతుందన్న అంచనాలు ఉన్నాయి. వైల్ కాలర్ క్యాండిడేట్స్ అంతా ఓ గ్యాంగ్‌ను తయారు చేసి భిక్షాటన చేసి సొమ్ము చేసుకుంటున్నారు. యాచకులకు రోజు గడవడంతో పాటు బెగ్గింగ్ గ్యాంగ్‌లను నడుపుతోన్న వాళ్లు కోట్లకు పడగలెత్తున్నారు. దీంతో పాక్‌లో బిచ్చమెత్తుకోవడం అనేది ఉపాధి కల్పించే పరిశ్రమగా మారిపోయింది.

Also Read : లద్దాఖ్‌ బోర్డర్‌లో డ్రాగన్‌ కుట్రలు.. ఆ బంకర్లను ఎందుకు నిర్మిస్తోంది.. కవ్వించే ప్రయత్నంలో భాగమా?

ఓ వైపు విదేశాల నుంచి ఫిర్యాదులు.. మరోవైపు దేశంలో భిక్షగాళ్ల గొడవలు పాక్‌కు తలనొప్పిగా మారాయి. అసలే అంతర్గత సమస్యలు, సంక్షోభంతో ఆగమాగం అవుతోన్న పాకిస్తాన్‌కు ఇతర దేశాల నుంచి వస్తున్న ఫిర్యాదులు తలనొప్పిగా మారాయి. దీంతో ఓ వైపు యాచకులను ఇతర దేశాలకు పంపిస్తూనే మరోవైపు బెగ్గర్స్‌పై బ్యాన్ పేరుతో కొత్త రాగం ఎత్తుకుంది పాకిస్తాన్.