ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, రిమాండ్ అంశాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి బదిలీ..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Delhi CM Arvind Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అనారోగ్య కారణాలరీత్యా ఈడీ కేసులో కేజ్రీవాల్‌కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, రిమాండ్ అంశాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తా ధర్మాసనం తీర్పు వెలువరించింది.

లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ పూర్తి చేసిన సుప్రీకోర్టు తీర్పును మే17న రిజర్వ్ చేసింది. దీంతో ఇవాళ తీర్పు వెలువరించింది. అలాగే, ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేని చెప్పింది. కాగా, గత నెల 27 నుంచి కేజ్రీవాల్ సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

లిక్కర్ స్కాం కేసులో ఎన్నికల సమయంలోనూ బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్‌.. ఆ తర్వాత ప్రచారలో పాల్గొన్నారు. వన్‌ నేషన్ వన్ లీడర్ కాన్సెప్ట్ తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని దేశంలో మరే రాజకీయ నేత ఉండకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన మొదటి నుంచీ అంటున్నారు.

Also Read: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ‘ఆధార్ కార్డ్’ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ నేతలు ఆగ్రహం