Vijay Deverakonda : ఏకంగా 18 మంది ట్రాన్స్‌ జెండర్స్‌‌కి విజయ్ దేవరకొండ సాయం.. ఏం చేసాడంటే..

ఓ ట్రాన్స్‌జెండర్‌ విజయ్ చేసిన సాయం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.

Vijay Deverakonda : ఏకంగా 18 మంది ట్రాన్స్‌ జెండర్స్‌‌కి విజయ్ దేవరకొండ సాయం.. ఏం చేసాడంటే..

Vijay Deverakonda helps to Transgenders Emotional Video goes Viral

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ తన సినిమాలతో, తన స్పీచ్ లతో బాగానే పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించింది విజయ్ త్వరలో భారీ పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నాడు. అయితే విజయ్ సినిమాల్లోనే కాదు బయట కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరో అని చాలా సార్లు అనిపించుకున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా విజయ్ చాలా మందికి సహాయం చేసాడు.

అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో విజయ్ మిడిల్ క్లాస్ ఫండ్స్ అని ఓ ఫౌండేషన్ పెట్టి తన డబ్బుతో పాటు విరాళాలు కూడా సేకరించి ఎంతోమంది పేదలకు నిత్యావసరాలు అందించి సహాయం చేసాడు. తాజాగా ఆ సమయంలో విజయ్ చేసిన ఓ గొప్ప విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇటీవల విజయ్ దేవరకొండ ఆహాలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి ఓ ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చారు. అయితే ఆ స్టేజిపై ఓ ట్రాన్స్‌జెండర్‌ విజయ్ చేసిన సాయం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : TG Vishwa Prasad : అమెరికాలో జనసైనికుల సంబరాలు.. పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేసిన తెలుగు నిర్మాతని అభినందించి..

ఆ ట్రాన్స్‌జెండర్‌ మాట్లాడుతూ.. నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ ని సార్. నాకు బెగ్గింగ్ తప్ప ఎలాంటి ఆధారం లేదు బతకడానికి. లాక్ డౌన్ సమయంలో మాకు ఇల్లు గడవలేదు. అప్పుడు సోషల్ మీడియాలో మీ ఫౌండేషన్ చూసి అప్లై చేశాను. 16 నిమిషాల్లో నాకు కాల్ చేసి సాయం చేసారు. నాకు మాత్రమే కాక మా కమ్యూనిటీలో దాదాపు 18 మందికి, నా ఫ్యామిలీకి మీరు ఆ సమయంలో సహాయం చేసారు. మిమ్మల్ని ఎప్పట్నుంచో కలుద్దామనుకున్నాను సర్. ఇవాళ ఇలా కుదిరింది. మాకు కనిపించే దేవుడు మీరే థ్యాంక్యూ సో మచ్ అంటూ ఎమోషనల్ అయింది.

దీనికి విజయ్ స్పందిస్తూ.. అది నా ఒక్కడివల్ల అవ్వలేదు. అప్పుడు ఎంతోమంది విరాళాలు ఇచ్చారు. నువ్వు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, నువ్వు బాగుంటే చాలు అని అన్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్ అవ్వగా విజయ్ అభిమానులు, నెటిజన్లు విజయ్ ని అభినందిస్తున్నారు.