Gautam Gambhir : మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఆడతామంటే కుద‌ర‌దు..? హార్దిక్‌కు గంభీర్ వార్నింగ్..?

ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో గంభీర్ మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Gautam Gambhir : మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఆడతామంటే కుద‌ర‌దు..? హార్దిక్‌కు గంభీర్ వార్నింగ్..?

Gautam Gambhir sets new selection standards after taking over as India head coach

టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌ను బీసీసీఐ నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. శ్రీలంక ప‌ర్య‌ట‌న నుంచి అత‌డు కోచ్‌గా బాధ్య‌త‌ల‌ను అందుకోనున్నాడు. ఈ క్ర‌మంలో ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో గంభీర్ మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఓ ఆట‌గాడు ఫిట్‌గా ఉంటే మూడు ఫార్మాట్ల‌లో ఆడాల్సిందేన‌ని చెప్పాడు. ప‌నిభారం, గాయాల బెడ‌ద అని చెబుతూ కేవ‌లం కొన్ని ఫార్మాట్ల‌లోనే ఆడ‌తామ‌ని చెబితే తాను స‌హించ‌న‌ని అన్నాడు. ఇలాంటివి త‌న‌కు న‌చ్చ‌వ‌ని తెలిపాడు.

ఇటీవ‌ల కొంద‌రు యువ ఆట‌గాళ్లు ఐపీఎల్‌లో అధిక సంపాద‌న‌కు ఆశ‌ప‌డి టెస్టు క్రికెట్‌, దేశ‌వాలీ క్రికెట్ ఆడేందుకు ఇష్ట‌ప‌డిని సంగ‌తి తెలిసిందే. రంజీలు ఆడ‌క‌పోవ‌డంతో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌లకు సెంట్ర‌ల్ కాంట్రాక్టును బీసీసీఐ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ ఆడుతూ వ‌స్తున్న హారిక్ పాండ్య గాయాల భ‌యంతో 2018 నుంచి టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు.

ఓ ఆట‌గాడు పూర్తి ఫిట్‌గా ఉంటే మూడు ఫార్మాట్లు ఆడాల‌ని తాను భావిస్తాన‌ని గంభీర్ చెప్పాడు. గాయాల బెడ‌ద అంటూ కొన్ని ఫార్మాట్ల‌కు దూరంగా ఉండ‌డం త‌న‌కు న‌చ్చ‌ద‌న్నాడు. గాయ‌ప‌డితే ఏమ‌వుతుంది..? కోలుకుని మళ్లీ జ‌ట్టులో చేరొచ్చున‌ని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న టాప్ ఆట‌గాళ్లు ఎవ్వ‌రినైనా అడిగితే మూడు పార్మాట్లు ఆడాల‌ని వారు కోరుకుంటార‌న్నాడు. రెడ్‌ బాల్‌ బౌలర్లు లేదంటే వైట్‌ బాల్‌ బౌలర్లు అని ముద్ర వేసుకోవడానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌ర‌ని, గాయాలన్నవి ఆటగాళ్ల జీవితంలో ఓ భాగ‌మ‌న్నారు.

Teamindia : యువ‌రాజ్ మెరుపులు, ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ ఊచ‌కోత‌.. పైన‌ల్‌లోకి భార‌త్‌.. సెమీస్‌లో ఆసీస్ చిత్తు..

ఓ ఆట‌గాడు గాయ‌ప‌డ్డా ప‌ట్టుద‌ల‌తో కోలుకుని రావ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని చెప్పుకొచ్చాడు. కొంద‌మంది ప్లేయ‌ర్ల‌కు విశ్రాంతి ఇస్తూ ప్ర‌త్యేకంగా చూడ‌డం ప‌ట్ల త‌న‌కు స‌దాభిప్రాయం లేద‌న్నాడు. వాస్త‌వానికి ప్రొఫెషనల్‌ క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్‌ వ్యవధి చాలా తక్కువ అని, అందుక‌నే వీలైన‌న్ని ఎక్కువ మ్యాచులు ఆడాల‌ని అనుకోవాల‌న్నాడు. తాను క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి ఫలితాల గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశాన‌ని చెప్పాడు. ఆట‌లో వంద శాతం ఎఫ‌ర్ట్ పెడుతున్నామా..? లేదా అన్న‌దే త‌న‌కు ముఖ్య‌మ‌న్నాడు.

గంభీర్ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. అత‌డి మాట‌ల‌ను బ‌ట్టే జ‌ట్టు కూర్పు ఉంటుంద‌నే విష‌యం స్పష్ట‌మ‌వుతోంది. హార్దిక్ పాండ్యా, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్ వంటి ఆట‌గాళ్ల‌కు గంభీర్ ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చాడ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిఫ్రాయ ప‌డుతున్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు టీ20 క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బుమ్రా, సిరాజ్‌లు మాత్ర‌మే మూడు పార్మాట్ల‌లోనూ ఆడుతున్నారు.

Chris Gayle : 44 ఏళ్ల వ‌య‌సులోనూ క్రిస్‌గేల్ వీర‌విహారం.. ద‌క్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజ‌యం..